Home జాతీయ వార్తలు మెట్టు దిగిన ట్విట్టర్.. రాహుల్ గాంధీ ఖాతా పునరుద్ధరణ

మెట్టు దిగిన ట్విట్టర్.. రాహుల్ గాంధీ ఖాతా పునరుద్ధరణ

428
0
Rahul Gandhi's Twitter handle unlocked
Rahul Gandhi's Twitter handle unlocked

మెట్టు దిగిన ట్విట్టర్.. రాహుల్ గాంధీ ఖాతా పునరుద్ధరణ ఎట్టకేలకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ మెట్టు దిగింది. తాత్కాలికంగా రాహుల్ గాంధీ ఖాతాను నిలిపివేసిన ఒక వారం తరువాత, తిరిగి పునరుద్ధరించింది. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల ట్విట్టర్ ఖాతాలను కూడా పునరుద్ధరించింది. ట్విట్టర్ భారత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్ర వారం వ్యాఖ్యానించడం, కొద్ది సేపటికే ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ ను ఆ సంస్థ అమెరికాకు బదిలీ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. అయితే పునరాలోచనలో పడిన ట్విట్టర్ సంస్థ రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించి తమపై వస్తున్న ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

వాయువ్య ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాధితురాలి కుటుంబ చిత్రాలను రాహుల్ గాంధీ గత వారం ట్వీట్ చేశారు. తాను వారికీ అండగా ఉంటాయని ట్వీట్ లో తెలిపారు. దీనిపై ఓ బాలల హక్కుల సంస్థ ట్విట్టర్ కు ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడికి గురైన చిన్నారుల గుర్తింపును ఏ రూపంలో కూడా వెల్లడించరాదనే విషయాన్నీ ప్రస్తావించింది. దీంతో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ నుంచి ట్విట్టర్ కు నోటీసులు వెళ్లాయి. బాలిక తల్లిదండ్రుల చిత్రాలను బ్లర్ చేయకుండా నేరుగా పోస్ట్ చేయడంతో రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపి వేసింది. ఆయన బాటలోనే మరి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బాధిత బాలిక తల్లిదండ్రుల చిత్రాన్ని పోస్ట్ చేయడంతో వారి ఖాతాలను కూడా ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపి వేసింది. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ తీరు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ యొక్క ప్రమాదకరమైన క్రీడ అనే పేరుతో యూట్యూబ్ వీడియోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. ట్విట్టర్ తటస్థంగా ఉండకుండా ప్రభుత్వానికి అండగా ఉందని ఆరోపించారు. తన లక్షలాది మంది అనుచరులకు తన అభిప్రాయం చెప్పే హక్కును ట్విట్టర్ నిరాకరిస్తోందని, ఇది అన్యాయమని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌తో ఘర్షణ నేపథ్యంలో, ట్విట్టర్ తన ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేసింది. దీనికి ద్వేషపూరిత నేరానికి సంబంధించిన వీడియో నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఒక కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఎండీ మనీష్ మార్పునకు ఎటువంటి కారణాన్ని పేర్కొనకపోయినప్పటికీ, ఆయన రెవెన్యూ స్ట్రాటజీ మరియు ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా అమెరికాకు వెళ్లి తన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.

Previous articleట్విట్టర్ ఇండియా ఎండీ యుఎస్ కి బదిలీ
Next articleసినీ ప్రియులను ఖుషీ చేసే వీకెండ్ ఇది..