Home అంతర్జాతీయ వార్తలు ముగ్గురు పిల్లల విధానానికి చైనా ఆమోదం

ముగ్గురు పిల్లల విధానానికి చైనా ఆమోదం

151
0
China approves three-child policy
China approves three-child policy

ముగ్గురు పిల్లల విధానానికి చైనా ఆమోదం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన చైనాలో జనన రేటు గణనీయంగా తగ్గడం ఆ దేశ పాలకులకు కలవర పెడుతోంది. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం, ఒక్కరు ముద్దు – ఇద్దరు వద్దు అనే స్లోగన్స్ డ్రాగన్ కంట్రీ నుంచే వచ్చాయి. ప్రస్తుతం జనాభా రేటు తగ్గిపోవడంతో కమ్యూనిస్టు పాలకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జనాభా పెరుగుదలను నిరోధించే ప్రధాన పాలసీ మార్పును అక్కడి పాలకులు చేపట్టారు. పాలక కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదించిన ముగ్గురు పిల్లల విధానాన్ని చైనా జాతీయ శాసనసభ శుక్రవారం అధికారికంగా ఆమోదించింది.

చైనీస్ జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండటానికి అనుమతించేలా చట్టాన్ని సవరించారు. ఈ సవరించిన జనాభా మరియు కుటుంబ ప్రణాళిక చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. పెరుగుతున్న వ్యయాల కారణంగా ఎక్కువ మంది పిల్లలు పుట్టడానికి చైనా జంటలు విముఖతను చూపుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించడానికి స్పష్టమైన ప్రయత్నంలో భాగంగా చట్టాన్ని సవరించారు. సవరించిన చట్టం.. ప్రజల ఆందోళనలను పరిష్కరించడానికి దోహదపడనుంది. వారికి సామాజిక, ఆర్థిక సహాయక చర్యలను అందించే ప్రక్రియను ఆమోదించింది. గతంలో ఒక్కరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే నిబంధనలు కఠినంగా ఉండేవి. దీంతో చైనాలో జంటలు ఒక్కరిని మాత్రమే కనేలా తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు.

కొత్త చట్టం ప్రకారం పన్నులు, భీమా, విద్య, గృహనిర్మాణం, ఉద్యోగాలతో సహా కుటుంబాల భారాలను తగ్గించడానికి దోహదపడనుంది. పిల్లలను పెంచడానికి, వారి విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చుతో సహా సహాయక చర్యలు చేపట్టడానికి చేయూత అందించనుంది. సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిలో కొత్త పరిస్థితులను ఎదుర్కోవటానికి చైనా సర్కారు చర్యలు తీసుకుంది. సమతుల్య దీర్ఘకాలిక జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి కేంద్ర నాయకత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎన్‌పిసి చట్టాన్ని సవరించింది.

ఈ ఏడాది మేలో, పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) తన కఠినమైన రెండు-పిల్లల విధానాన్ని సడలించడానికి ఆమోదించింది. దేశంలో జనాభా సంక్షోభానికి పాలసీ మేకర్స్ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. కఠినమైన దశాబ్దాల నాటి ఒకే చిన్నారి విధానాన్ని రద్దు చేస్తూ 2016లో దంపతులందరికీ ఇద్దరు పిల్లలు పుట్టడానికి చైనా అనుమతించింది.

మూడు దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఒక బిడ్డ విధానం 400 మిలియన్లకు పైగా జననాలను నిరోధించిందని చైనా అధికారులు పేర్కొన్నారు. ఈ నెలలో ఒక దశాబ్దానికి ఒకసారి జరిగిన జనాభా లెక్కల ప్రకారం, మూడవ బిడ్డను అనుమతించాలనే నిర్ణయంతో చైనా జనాభా 1.412 బిలియన్‌లకు నెమ్మదిగా పెరిగిందని అధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. కొత్త జనాభా లెక్కల గణాంకాల ప్రకారం 60 ఏళ్లు పైబడిన ప్రజల జనాభా గత సంవత్సరం 18.7 శాతం పెరిగిందని చెబుతున్నారు. మొత్తంగా 26 కోట్ల జనాభా పెరిగిందని చైనా అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.

Previous articleకొండపొలం ఫస్ట్ లుక్.. సరి కొత్తగా వైష్ణవ తేజ్
Next articleఇంటింటికీ తలుపు కొట్టి.. పౌరులను కాల్చి వేస్తున్న తాలిబాన్లు