Home Technology మా యాప్ లు వినియోగించండి.. భారతీయ విద్యార్ధులపై చైనా ఒత్తిడి

మా యాప్ లు వినియోగించండి.. భారతీయ విద్యార్ధులపై చైనా ఒత్తిడి

223
0
Indian students being ‘forced’ to download banned Chinese Apps
Indian students being ‘forced’ to download banned Chinese Apps

తమ దేశంలో వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై చైనా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. భారత ప్రభుత్వం నిషేధం విధించిన యాప్ లను వినియోగించాలంటూ ఇరకాటంలోకి నెడుతోంది. ఫలితంగా ఆ దేశంలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇతర దేశాలలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల సంఖ్యా నానాటికీ పెరుగుతూ వస్తోంది. సుమారు 23 వేల మంది విద్యార్థులు చైనాలో అభ్యసిస్తున్నట్లు సమాచారం. అయితే వీరిలో కనీసం 20 వేల మందికి భారత ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి రావడంతో ఇరకాటంలో పడ్డారు. సరిహద్దులో ఇరు దేశాలకు ఘర్షణ అనంతరం ఆ దేశానికి చెందిన యాప్ లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 250 వరకు చైనా యాప్ లు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. ఇక కరోనా ప్రబలిన తర్వాత ఆ దేశంలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులతోనే తమ విద్యా సంవత్సరాలను కొనసాగిస్తున్నారు. చైనా కు వెళ్లే విమానాలపై ట్రావెల్ బాన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇది తప్పడం లేదు.

అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే భారత ప్రభుత్వం నిషేధించిన యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందిగా అక్కడి వర్సిటీలు బలవంతం చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
చైనాలోని చాలా విశ్వవిద్యాలయాలు వీచాట్, డింగ్‌టాక్, సూపర్‌స్టార్, టెన్సెంట్ – వీడియో చాట్ వంటి యాప్ లను ఉపయోగిస్తున్నాయి.
ఈ అనువర్తనాలకు ప్రాప్యతను నిర్వహించి అధ్యయనం చేయాలని వారు విద్యార్థులను కోరారు. ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ చైనా (ఐఎస్సి) లో సభ్యులుగా ఉన్న ఈ విద్యార్థులు తమ సమస్యను చైనా-భారత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాత్కాలిక పరిష్కారంగా, విద్యార్థులు తరగతులకు హాజరు కావడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారా ఈ యాప్ లను వినియోగిస్తున్నారు. మన దేశానికి చెందిన విద్యార్థులు వార్షిక ట్యూషన్ ఫీజును రూ.3 లక్షల నుండి రూ.4.5 లక్షల మధ్య చెల్లిస్తారు. చైనాకు కూడా ప్రయాణం నిషేధించడంతో ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాల్సి వస్తోంది. గుజరాత్ విద్యార్థుల తరపున, తాను మరికొందరు కలిసి విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వ మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు దక్షిణ గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్జిసిసిఐ) సభ్యుడు మనీష్ కపాడియా ఇటీవల మీడియాకు వెల్లడించారు.

Previous articleహై అలెర్ట్.. భారత్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం
Next articleపెగాసస్ కు వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ ఏకం కావాలి : మమతా బెనర్జీ