Home Technology మార్కెట్ లో మోటరోలా స్మార్ట్ ఫోన్లు.. కళ్ళు చెదిరే ఫీచర్లు

మార్కెట్ లో మోటరోలా స్మార్ట్ ఫోన్లు.. కళ్ళు చెదిరే ఫీచర్లు

222
0
Motorola launches Edge 20 series smartphones in India
Motorola launches Edge 20 series smartphones in India

మార్కెట్ లో మోటరోలా స్మార్ట్ ఫోన్లు.. కళ్ళు చెదిరే ఫీచర్లు గత నెలలో మోటరోలా తన నెక్స్ట్ జనరేషన్ ఎడ్జ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 లైట్, మోటరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది. ఆగస్టులో యూరోప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారతదేశ మార్కెట్ లో కంపెనీ ఈ రోజే విడుదల చేసింది.

మోటరోలా కొత్త ఫోన్ల ధరలు, ఫీచర్లు ఇవే..
మోటరోలా ఎడ్జ్ 20.. భారతదేశంలో ఆగస్టు 24 నుంచి ఫ్లిప్ కార్ట్ లో 29,999కి ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫ్రాస్టెడ్ పెర్ల్, ఫ్రాస్టెడ్ ఎమరాల్డ్ కలర్ వేరియంట్‌లలో ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో విక్రయానికి ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ యొక్క 6 జిబి ర్యామ్ + 128 జిబి ఇన్ బిల్ట్ మెమరీ ధర ₹ 21,499 గా కంపెనీ ప్రకటించింది. 8 జిబి ర్యామ్ + 128 జిబి ఇన్ బిల్ట్ వెర్షన్ డివైస్ ధర 22,999గా కంపెనీ తెలిపింది.

మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 7 మిమీ మందంతో అత్యంత నాజూకుగా ఉంటుంది. మోటరోలా దీనిని మన దేశంలో అత్యంత సన్నని, తేలికైన 5G ఫోన్‌లలో ఒకటిగా పేర్కొంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778 జి 5జి చిప్‌సెట్ అమర్చారు. కెమెరా విషయానికొస్తే 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా + 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ + మైక్రోసెన్సర్ + 8 మెగా పిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ ను రూపొందించారు. ముందు భాగంలో, క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

మోటరోలాఎడ్జ్ 20 ఫ్యూజన్ ధర, స్పెసిఫికేషన్లు
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6.7అంగుళాల ఫుల్ హెచ్‌డి ఓఎల్ఇడి డిస్‌ప్లేతో, 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది 8 జిబి ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్ స్పేస్‌ ను అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 108MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు మైక్రో విజన్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు భాగంలో, క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీతో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 పై నడుస్తుంది మరియు కంపెనీ టర్బోఛార్జ్ 30 టెక్నాలజీకి మద్దతుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Previous articleతాలిబన్ అనుకూల పోస్టులపై ఫేస్ బుక్ నిషేధం
Next articleఆఫ్ఘన్ ప్రజలకు చేయూతపై కేంద్రం సమాలోచనలు