Home సినిమాలు మహేష్ బాబు హీరోగా రామాయణం?

మహేష్ బాబు హీరోగా రామాయణం?

643
0
Mahesh Babu will as Lord Rama in PAN India Movie
Mahesh Babu will as Lord Rama in PAN India Movie

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మధు మంతెన తన డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో చేతులు కలుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతకుముందు సినిమా వివరాల గురించి అడిగినప్పుడు, దీపావళి సందర్భంగా కాస్టింగ్ వివరాలు బయటపెడతామని చెప్పారు. కానీ, ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుండి, ఈ ప్రతిష్టాత్మక ఇతిహాస కథలో మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తారని అనేక పుకార్లు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మూవీ మేకర్స్ తనను సంప్రదించినప్పుడు మహేష్ బాబు తన తేదీల సర్దుబాటు కారణంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించారనే పుకార్లు షికార్లు చేశాయి. వీటిపై స్పందించిన నిర్మాత మధు మంతేన అవన్నీ నిరాధారమైనవని అన్నారు.

మహేష్ బాబు, నమిత్ మల్హోత్రా(దర్శకులు) నాకు చాలా సన్నిహితులు. నేను వారితో రామాయణం గురించి చాలా విషయాలు పంచుకున్నాను, కాని సినిమా గురించి ఎవరితోనూ చర్చ జరగలేదు. కొంతమంది నటులతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఊహాగానాలు వచ్చాయని నేను భావిస్తున్నాను ” అని మధు మంతెన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మహేష్‌తో కలిసి ‘రామాయణం’ చేయాలనుకుంటే, మేము ఆయన కోసం ఎదురు చూస్తామని, కానీ తాము ఇంకా సినిమాపై కేవలం చర్చల్లోనే ఉన్నామని చెప్పారు. మహేష్ అద్భుతమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. రామాయణం కథను తయారుచేసేవారు ప్రాజెక్టు అభివృద్ధి దశలోనే ఉన్నారని, అందువల్ల తాము మహేష్ బాబు, ఇతర నటులు ఇందిలో నటిస్తున్నారంటూ వచ్చే వదంతులు కూడా నమ్మొద్దని ఆయన చెప్పారు. ఈ భారీ సినిమా నిర్మాణ ప్రక్రియలో నిర్మాతలు కొందరు నటీనటులను తీసుకోవాలని యోచిస్తున్న విషయం వాస్తవమేనని, అయితే ఈ ఏడాది దీపావళికి తారాగణాన్ని ప్రకటిస్తామని వివరించారు.
ఇంతకుముందు మధు మంతెన కూడా ఈ మూవీని 3 డి ఫార్మాట్‌లో నిర్మిస్తామని, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ, రవి ఉద్యోవర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. ఈ పెద్ద ప్రాజెక్ట్ 2017 లో ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అప్‌డేట్‌ లేదు. అయితే ఈ సినిమా తారాగణం గురించి తెలుసుకోవాలంటే దీపావళి వరకు అంతా వేచి ఉండాల్సిందే.

Previous articleప్రధాని మోడీతో మమతా బెనర్జీ భేటీ
Next articleకర్ణాటక సీఎంగా బసవరాజ్ సోమప్ప బొమ్మాయి