Home సినిమాలు మహేష్ బాబు ” సర్కార్ వారి పాట” పై భారీ అంచనాలు

మహేష్ బాబు ” సర్కార్ వారి పాట” పై భారీ అంచనాలు

154
0

మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్ ఇరువురు కలిసి నిర్మిస్తున్న, తెలుగు సినిమా ఇండస్ట్రీ  మిల్క్ బాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి కీర్తి సురేష్ ఇద్దరు జంటగా నటిస్తున్న కొత్త సినిమా ” సర్కార్ వారి పాట”. పరశురామ్ పెట్ల దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటు మహేష్ బాబు అభిమానుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. అయితే మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆశగా, ఆతృతగా తమ హీరో మహేష్ బాబు ” సర్కార్ వారి పాట” సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.

ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫ్రీ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో వచ్చిన స్పందనను దాటి సరికొత్తగా మరో రికార్డును సెట్ చేయాలని మహేష్ బాబు అభిమానులు చూస్తున్నారు. మహేష్ బాబు ” సర్కార్ వారి పాట” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అన్ని సినిమా పోస్టర్స్ కంటే నెంబర్ వన్ లుక్ పోస్టర్ గా నిలపాలన్నది అభిమానుల తాపత్రయం. మ్యూజిక్ డైరక్టర్ గా ఎస్. థమన్, ఇకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్. సుబ్బారాజు కూడా నటిస్తున్నట్లు సమాచారం.        

Previous articleTNR కుటుంబానికి దర్శకుడు మారుతి 50 వేల సాయం
Next articleఎప్పటికైనా తమిళ ఇంటి కోడలనవుతాను – ‘ఛలో’ రష్మిక