Home అంతర్జాతీయ వార్తలు భారత్ లో ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ చీఫ్ పర్యటన

భారత్ లో ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ చీఫ్ పర్యటన

310
0
Afghan Army Chief Gen Ahmadzai expected to visit India next week
Afghan Army Chief Gen Ahmadzai expected to visit India next week

ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ వాలి మొహమ్మద్ అహ్మద్జాయ్ జూలై 27 నుంచి మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. విదేశీ బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ అంతటా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సాయం కోరడంతో పాటు, ద్వైపాక్షిక సైనిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం భారత్ రానున్నారు. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ వాలి మొహమ్మద్ అహ్మద్జాయ్… భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సహా అగ్రశ్రేణి భారత సైనిక అధికారులతో విస్తృత చర్చలు జరపనున్నట్లు ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు.

మే 1 నుండి అమెరికా తన దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించిన తరువాత దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించడానికి, తాలిబాన్ దళాలు దాడులు చేపడుతున్నాయాయి. ఈ నేపథ్యంలో తన భద్రతా దళాలను బలోపేతం చేయడానికి మద్దతు కోరుతూ ఆఫ్ఘనిస్తాన్ తన ముఖ్య మిత్రదేశాలను సాయం కోరుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం తన వాయు శక్తిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో సోవియట్ యుగం నాటి హెలికాప్టర్లు, రవాణా విమానాలను తయారు చేయడంలో భారతదేశం సహాయాన్ని ఆఫ్ఘనిస్తాన్ కోరింది. మాస్కోకు వ్యతిరేకంగా, పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా విమానం, హెలికాప్టర్ల కోసం విడిభాగాలు పొందడానికి ఆఫ్ఘానిస్తాన్ దేశం చాలా కష్టపడుతోంది. గత నెలలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని సైన్యంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. జనరల్ యాసిన్ జియా స్థానంలో జనరల్ వలీ మొహమ్మద్ అహ్మద్జాయ్‌ను కొత్త సైనిక చీఫ్ గా నియమించారు.
జనరల్ అహ్మద్జాయ్ తన దళాల పోరాట సామర్థ్యాన్ని పెంచడానికి భారతదేశం నుండి సైనిక సామాగ్రి సరఫరాను కోరే అవకాశం ఉంది. పాకిస్తాన్ లో తమ రాయబారి కుమార్తెను అపహరించిన తరువాత ఇస్లామాబాద్ తో కాబూల్ వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ భారత పర్యటన కూడా ఉంది. శుక్రవారం తాష్కెంట్‌లో జరిగిన కనెక్టివిటీ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘని, పాకిస్తానీ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్‌లోకి వస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఆ వేదిక పై ఉండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి ఏర్పడటానికి కృషి చేసే దేశాలలో భారతదేశం ప్రధాన భాగస్వామి. ఇప్పటికే దాదాపు 3 బిలియన్ డాలర్ల సహాయం, ఆ దేశ పునర్నిర్మాణ కార్యకలాపాలకు భారత్ పెట్టుబడి పెట్టింది. ఆఫ్ఘన్ లో శాంతి, సయోధ్య ప్రక్రియకు భారతదేశం మద్దతు ఇస్తోంది.

Previous article“బెంగాల్ హింస”పై రేపు ఢిల్లీలో బీజేపీ ధర్నా
Next articleఇందుకే.. మీతో ప్రేమలో పడతారు.!