Home Technology బ్లాక్‌చెయిన్ ఛేదించి.. 12 వేల కోట్లు దోచిన హ్యాకర్!

బ్లాక్‌చెయిన్ ఛేదించి.. 12 వేల కోట్లు దోచిన హ్యాకర్!

435
0
Hackers steal $600 million in major cryptocurrency heist

బ్లాక్‌చెయిన్ ఛేదించి.. 12 వేల కోట్లు దోచిన హ్యాకర్! బ్లాక్‌చెయిన్.. కొద్ది కాలంగా బాగా పాపులర్ అయిన సాఫ్ట్ వేర్ ఇది. దీనిని హ్యాక్ చేయడం అసాధ్యమని ఇప్పటి వరకు టెక్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. అంతటి పటిష్ట భద్రత ఉన్న బ్లాక్‌చెయిన్ నెట్ వర్క్ ను హ్యాక్ చేశాడో అగంతకుడు. ఏకంగా 12 వేల కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కాజేశాడు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల అజమాయిషీ ఉండని ఈ క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టాడు ఆ హ్యాకర్. ఇది చరిత్రలోనే అతి పెద్ద మొత్తంలో హ్యాక్ అయిన ఘటనగా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ పాలీ నెట్‌వర్క్‌ లోకి హ్యాకర్ మంగళవారం చొరబడ్డాడు. తద్వారా ఇథేరియమ్, బినాన్స్ తదితర 600 మిలియన్ల విలువైన క్రిప్టో కరెన్సీని గుర్తు తెలియని హ్యాకర్ తస్కరించాడు. దీనిని పాలీ నెట్ వర్క్ ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది.

ఇప్పటి వరకు డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ లో ఇదే అతిపెద్ద హ్యాక్ అని తెలుస్తోంది. పాలీ నెట్‌వర్క్ అనేది వినియోగదారులకు క్రిప్టో టోకెన్‌లను మార్పిడి చేసుకోవడానికి అనుమతించే ఒక ప్లాట్‌ఫాం. మనదేశంలో విరివిగా ఉపయోగించే వాజిర్ ఎక్స్ (wazirx) వంటిది. తాజా క్రిప్టో కరెన్సీ దొంగతనం ద్వారా వేలాది మంది పెట్టుబడిదారులు ప్రభావితమయ్యారని నిర్ధారణ అయింది.

క్రిప్టో పెట్టుబడిదారుల నుండి మిలియన్ల డాలర్లు దొంగిలించబడ్డాయని ధృవీకరించిన పాలీ నెట్ వర్క్ తమ పెట్టుబడిదారుల (వినియోగదారులు)కు క్షమాపణలు చెప్పింది.

దొంగిలించబడిన మొత్తాన్ని ఏ ఖాతాకు బదిలీ అయ్యాయో వారి అడ్రస్ లను ట్విట్టర్ లో వినియోగదారులకు తెలిపింది. దాడి విషయం తెలుసుకున్నామని, తమకు సాధ్యమైనంత రికవరీ చేస్తామని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ బినాన్స్ సిఇఒ చాంగ్‌పెంగ్ జావో ట్వీట్ చేశారు.

ఆ కంపెనీ తెలిపిన చిరునామాల నుండి వచ్చే టోకెన్‌లను బ్లాక్‌లిస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని పాలీ నెట్ వర్క్ తెలిపింది. తాము జరిగిన తప్పిదాన్ని సరిదిద్దడానికి ప్రభావిత బ్లాక్‌చెయిన్, క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌ల మైనర్‌లను పిలవనున్నట్లు సంస్థ పేర్కొంది.

ఈ ఘటనతో నియో, ఒంటాలజీ, స్విట్చియో అనే బహుళ బ్లాక్‌చైన్ ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉన్న జట్ల మధ్య మైత్రి ఏర్పడింది. ఆస్తులను తిరిగి ఇవ్వమని హ్యాకర్లను కోరడంతో పాటు, హ్యాకింగ్ కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాలీ నెట్ వర్క్ సంస్థ తెలిపింది.

క్రిప్టో కరెన్సీ లో అత్యంత భద్రత కలిగినదానిగా ఇథేరియమ్ కు పేరుంది. అంతటి పటిష్ట వ్యవస్థ ఉన్న ఇథేరియమ్ టోకెన్లు 273 మిలియన్లు, బినాన్స్ స్మార్ట్ చైన్‌లో $ 253 మిలియన్లు, యుఎస్ డాలర్ కాయిన్ (USDC) టోకెన్‌లలో $ 85 మిలియన్లు దొంగిలించారు.

దాడి జరిగిన వెంటనే ఆయా ఖాతాలను స్తంభింప చేశారు. అంటే ఈ టోకెన్లను హ్యాకర్లు ఉపయోగించలేరు. కొన్ని నెలలుగా పలు సవాళ్ళను ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీకి ఈ దాడి తీరని నష్టం చేకూర్చిందనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

For More News

Previous articleటిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్
Next articleవిరిగి పడిన కొండ చరియలు.. ఇద్దరు మృతి, 30 మంది గల్లంతు?