Home తెలంగాణ బిజెపికి మోత్కుపల్లి గుడ్ బై

బిజెపికి మోత్కుపల్లి గుడ్ బై

323
0
Mothkupalli Narsimhulu resign to BJP
Mothkupalli Narsimhulu resign to BJP

భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా శుక్రవారం చేశారు. ఈ మేరకు ప్రెస్ పెట్టి మరీ తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. తన అనుభవాన్ని బిజెపి పట్టించుకోలేదని ఆయన వాపోయారు. పార్టీలో తనకు సముచిత స్థానం దక్కలేదని బాధ పడ్డారు. తన రాజకీయ జీవితంలో అవినీతికి తావు లేకుండా బ్రతికానన్నారు.అవినీతిపరుడిగా ముద్ర పడిన ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకోవడం సరి కాదన్నారు. దళితుల భూములను కబ్జా చేసిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కు అంత ఆస్తి ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ గెలవడానికి వీల్లేదని అన్నారు. దళితుల భూములు మింగిన ఈటల హుజురాబాద్ లో పోటీ చేయడానికి అనర్హుడన్నారు. ఈటల ను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అద్భుతమంటూ ప్రశంసించారు. సిఎం అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పు ఎలా అవుతుందని, దళితుల కోసం తలపెట్టిన సమావేశానికి వెళ్లడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. దళిత బంధు వంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. దళితులకు ఆర్థిక పరిపుష్టిని కలిగించడానికి, సామాజిక న్యాయం నెరవేరేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.
ఇటీవలే ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి మోత్కుపల్లి హాజరయ్యారు. అయితే ఆ సమావేశానికి హాజరుకాకూడదని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. దీనికి మోత్కుపల్లి హాజరుకావడం తో ఆయన కెసిఆర్ కు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకనుగుణంగానే కెసిఆర్ కు కొంత కాలంగా బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. బిజెపికి రాజీనామా చేసిన తరుణంలో త్వరలో టిఆర్ఎస్ లో మోత్కుపల్లి చేరనున్నట్లు తెలుస్తోంది.

Previous articleతృణమూల్ ఎంపీ సస్పెండ్.. పెగాసస్ పై పార్లమెంట్ లో కొనసాగుతున్న రగడ
Next articleఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం