Home జాతీయ వార్తలు బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్.. అర్ధరాత్రి ముంబైలో విస్తృత తనిఖీలు

బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్.. అర్ధరాత్రి ముంబైలో విస్తృత తనిఖీలు

458
0
Bomb Hoax At Mumbai Railway Stations, Amitabh Bachchan's Home
Bomb Hoax At Mumbai Railway Stations, Amitabh Bachchan's Home

బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్.. అర్ధరాత్రి ముంబైలో విస్తృత తనిఖీలు అర్ధరాత్రి సమయం.. ముంబై ప్రశాంతంగా ఉందని భావిస్తున్న వేళ పోలీసులకు ఆగంతకుల నుంచి ఫోన్ కాల్. వికృతంగా నవ్వుతు కాసేపట్లో రైల్వే స్టేషన్, బస్టాండ్ తో పాటు అమితాబ్ బచ్చన్ ఇంటిని పేల్చేస్తున్నామంటూ కాల్ కట్ చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసు వర్గాల్లో కలకలం రేగింది.

ముంబై లో ఏదైనా చిన్న ఘటన జరిగినా.. దేశం మొత్తం దృష్టి సారిస్తోంది. దీంతో నిఘా వర్గాలు, బాంబు స్క్వాడ్ బృందాలు బయల్దేరాయి. ముంబై బహిరంగ ప్రదేశాలను జల్లెడ పట్టాయి. అయితే చివరికి అదంతా ఫేక్ కాల్ గా పోలీసులు తేల్చారు. తమకు ఫోన్ చేసిన అనుమానితులను అదుపులోకి తీసుకుని బడిత పూజ చేశారు.


దాదర్, బైకుల్లా, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్లు మరియు జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా పేల్చివేస్తామని బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి నుండి ముంబై పోలీసులకు శుక్రవారం అర్థరాత్రి కాల్ వచ్చింది. దీంతో అవసరమైన అన్ని నిఘా ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.

తర్వాత రాత్రంతా ఆయా ప్రదేశాలలో సోదాలు జరిపారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. పోలీసు అధికారుల ప్రకారం, ముంబై పోలీసు ప్రధాన నియంత్రణ గదికి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కాల్ వచ్చింది.

స్థానిక పోలీస్ స్టేషన్లు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ప్రభుత్వ రైల్వే పోలీసులు, బాంబు డిటెక్షన్-డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. నాలుగు ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. చివరికి అమితాబ్ బచ్చన్ యొక్క నాలుగు బంగళాలను కూడా తనిఖీ చేసినట్లు జుహు పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ శశికాంత్ మనే చెప్పారు.

చివరకు బూటకపు కాల్ అని గ్రహించి, ఫోన్ కాల్ చేశారని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బంగ్లాలో భద్రత పెంచారు.

ఆకతాయిలు సరదాగా చేసిన పనికి ముంబై పోలీసులు రాత్రంతా వీధుల్లో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి ఆకతాయి పనులు చేసే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

For Latest Posts

Previous articleవచ్చే ఏడాది ప్రారంభంలో చిన్నారులకు కోవావాక్స్ : అథర్ పూనావాలా
Next articleరాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ