Home ఆరోగ్యం బహిరంగ సమావేశాలతో థర్డ్ వేవ్ ముప్పు : ఐఎంఎ

బహిరంగ సమావేశాలతో థర్డ్ వేవ్ ముప్పు : ఐఎంఎ

246
0
IMA Appeal to Government about Third Wave
IMA Appeal to Government about Third Wave

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రోత్సాహం, బహిరంగంగా గుమిగూడటం, సభలు, సమావేశాలు, భారీ సంఖ్యలో శుభకార్యాలు వంటి వాటితో థర్డ్ వేవ్ ముప్పు పొంచే ఉందని, దీనిపై నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదని భారత అత్యున్నత వైద్యుల సంఘం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఈ రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి కట్టడి చర్యలతో కరోనా కేసుల తీవ్రతను గణనీయంగా నిరోధించగలిగారని ఐఎంఎ చెప్పింది. అయితే ప్రస్తుతం అన్ లాక్ దిశగా వెళ్తుండటంతో ప్రజలు బహిరంగంగా సంచరిస్తున్నారు. దీంతో పాటు రాజకీయ పక్షాలు నిర్వహిస్తున్న బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, భారీ ఎత్తున శుభ కార్యాలతో మూడో ముప్పు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇటువంటి అంశాలన్నీ.. కోవిడ్ ను నిరోధించడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన వారికి ఇది బాధాకరంగా ఉండనుందని తెలిపింది.

కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించకుంటే ఏమవుతుందో, ప్రపంచ దేశాలు కొన్ని ఉదాహరణగా నిలిచాయని ఐఎంఎ వివరించింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా థర్డ్ వేవ్ ముప్పు అనివార్యమని హెచ్చరించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించకుండా ప్రభుత్వ, రాజకీయ నిర్ణయాలతో ప్రజలు సామూహికంగా నిమగ్నమవడం భాధాకరమని వ్యాఖ్యానించింది.
“పర్యాటక బోనంజా, తీర్థయాత్ర ప్రయాణం, మతపరమైన ఉత్సాహం అన్నీ అవసరం, కానీ మరికొన్ని నెలలు వేచి ఉండక తప్పదు. ఈ ఆచారాలను ప్రారంభించడం, టీకాలు లేకుండా ప్రజలను ఈ సామూహిక సమావేశాలలో స్వేచ్ఛగా వెళ్ళడానికి వీలు కల్పించడం వంటివి చేస్తే వారంతా సూపర్ స్ప్రెడర్స్ గా మారే అవకాశం ఉంది” అని ఐఎంఎ చెప్పింది.
కోవిడ్ రోగికి చికిత్స చేయడం వల్ల కలిగే పరిణామాలు, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని పోలిస్తే, అటువంటి సామూహిక సేకరణను నివారించడం ద్వారా కలిగే ఆర్థిక నష్టం కంటే మెరుగ్గా ఉంటుందని హితవు పలికింది.
గత ఏడాదిన్నర అనుభవంతో చూస్తే, థర్డ్ వేవ్ ప్రభావాన్ని సార్వత్రిక టీకాలు వేయడం ద్వారా, కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించడం ద్వారా తగ్గించవచ్చని తెలిపింది.

Previous articleవాట్సాప్ వెబ్ లో కొత్త ఫీచర్
Next articleవివాహాలను నిషేధిస్తే సరి.. జనాభా నియంత్రణ బిల్లుపై రాజకీయ విమర్శలు