Home Covid 19 బూస్టర్ డోస్‌తోనే కరోనాకు అడ్డుకట్ట : ఆంటోనీ ఫౌచీ

  బూస్టర్ డోస్‌తోనే కరోనాకు అడ్డుకట్ట : ఆంటోనీ ఫౌచీ

  531
  0
  As Delta Pushes US To 100,000 Daily Cases, Dr Fauci's Advice on Boosters
  As Delta Pushes US To 100,000 Daily Cases, Dr Fauci's Advice on Boosters

  బూస్టర్ డోస్‌తోనే కరోనాకు అడ్డుకట్ట : ఆంటోనీ ఫౌచీ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు బూస్టర్ డోస్ (మూడో టీకా) వేయడాన్ని వేగవంతం చేయాలని యునైటెడ్ స్టేట్స్ అంటువ్యాధుల విభాగం చీఫ్ ఆంటోనీ ఫౌచీ అన్నారు. బూస్టర్ డోస్ విధానాన్ని తాను సమర్థిస్తానని, డెల్టా వేరియంట్ మహమ్మారిని అరికట్టడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. అమెరికాలో డెల్టా వేరియంట్ కరోనా కేసులు రోజువారీ లక్షకు పైగా నమోదవుతున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. సాధారణ జనాభాకు పూర్తిస్థాయిలో రెండు టీకాలు వేయడాన్ని శరవేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఫౌచీ అన్నారు. రెండు టీకాలు వేసిన వారికి మూడో టీకా ఇవ్వాలా వద్దా అనే చర్చ ప్రారంభమైన తర్వాత, బూస్టర్ షాట్‌లకు అధికారిక ఆమోదంపై ఫౌచీ మాట్లాడారు. బూస్టర్‌లను విస్తృతంగా వినియోగించిన మొదటి దేశం ఇజ్రాయెల్‌ దేశం నిలిచిందన్నారు. 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 5 లక్షలకు పైగా ప్రజలు ఆదివారం నాటికి మూడవ టీకా పొందారని వివరించారు.

  అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కీమోథెరపీ చేయించుకున్నవారితో సహా రోగనిరోధక వ్యవస్థలో రాజీపడిన చాలా మంది వ్యక్తులు తమ కోవిడ్ -19 టీకా నుండి తగిన రక్షణ పొందలేరని ఫౌచీ అన్నారు. యుఎస్ అంతటా, డెల్టా వేరియంట్ రోజుకు లక్ష కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఆరు నెలల క్రితం గత శీతాకాలంలో కనిపించిన రోజువారీ సగటు మరణాల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. కొత్తగా ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని పేర్కొన్నారు.

  న్యూయార్క్, న్యూజెర్సీలో పనిగంటలు సర్దుబాటు చేస్తున్నారని, కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవడమే దీనికి కారణమని ఫౌచీ చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ అందుకున్నవారు ఎవరైనా ఫైజర్, మోడెర్నా టీకాలను పొందొచ్చన్నారు. అయితే వారు తమ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మూడో టీకా వేయించుకోవాలన్నారు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న వేరియంట్ ల కారణంగా వాటిని తాము ఎంత మాత్రం తేలికగా తీసుకోబోమని చెప్పారు. కోవిడ్ -19 వ్యాక్సిన్‌లపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పూర్తి ఆమోదం పొందిన తర్వాత పాఠశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో టీకా పొందాలనే ఆదేశాలకు తాను మద్దతు ఇస్తున్నట్లు ఫౌచీ చెప్పారు. ప్రస్తుతం అగ్ర రాజ్యం అమెరికాలో టీకాలు పొందడానికి అక్కడి ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో, కరోనా అక్కడ విజృంభిస్తోంది. ఫలితంగా టీకాల ఆవశ్యకతను ఆంటోనీ ఫౌచీ, ఇతర ప్రముఖులు ప్రజలకు అర్ధమయ్యేలా సందేశం ఇస్తున్నారు.

  Previous articleఅమెజాన్ ఫ్లిప్‌కార్ట్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
  Next articleపంజాబ్ లో టిఫిన్ బాక్స్ బాంబు.. ఉలిక్కిపడిన నిఘా వర్గాలు