Home ఆరోగ్యం ఫైబర్.. అధికంగా ఉండే పదార్ధాలివే..

ఫైబర్.. అధికంగా ఉండే పదార్ధాలివే..

542
0
Highly Fiber Content Food Items
Highly Fiber Content Food Items

మెరుగైన ఆరోగ్యం కోసం ఆహారంలో ఫైబర్ (పీచు పదార్ధాలు) చేర్చాలని పోషకాహార నిపుణులు తరచు చెప్తుండటం మనం వింటుంటాం.
అసలు ఈ ఫైబర్ అంటే ఏంటి.. దీని వల్ల మనకు కలిగే ఉపయోగాలేంటి అనే విషయాలను మొదటగా తెలుసుకుందాం. మొక్కల ఆధారిత ఆహారంలో ఒక భాగాన్నే ఫైబర్ గా పిలుస్తారు. ఇది అధికంగా ఉండే పదార్ధాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా పెద్దప్రేగు ప్రాంతంలోని కణాలు మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మల బద్ధకం వంటి సమస్యలు దరి చేరవు. అంతే కాకుండా మన ఆహారంలో అధిక ఫైబర్ ఉంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. హృద్రోగ సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్ధాలను క్రింద పేర్కొన్నాము.
అరటి : అరటిలో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకం నుండి దూరం చేస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అరటిని రోజువారీ ఆహారంలో భాగం చేయడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి.
వోట్స్ : వోట్స్ ఫైబర్ యొక్క ఉత్తమ వనరులలో ఒకటిగా పోషకాహార నిపుణులు పరిగణిస్తారు. వోట్స్ ఉప్మా, పాలలో వోట్స్ ఇలా వివిధ మార్గాల్లో ఓట్స్ ను ఆహారంలో చేర్చవచ్చు. తద్వారా శరీరానికి ఫైబర్ అధికంగా అందుతుంది.
కాయధాన్యాలు : కాయధాన్యాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాయధాన్యాలలో కనిపించే ఫైబర్ మీ శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజంతా మీ మనస్సు మరియు శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.

అవిసె గింజలు : అవిసె గింజలు లిన్సీడ్ మొక్క నుండి లభిస్తాయి. ఈ చిన్న విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఇవి పెద్దలలో, డయాబెటిస్ రోగులలో ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుందని నమ్మకం ఉంది. అవిసె గింజలను చిక్కని పెరుగులో కలిపి, పుదీనాతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
యాపిల్స్ : యాపిల్స్ ను పైన తొక్కతో తింటే అధిక ఫైబర్ శరీరానికి అందుతుంది. పైన తొక్కలతో కలిపి తీసుకుంటే ఫైబర్ శరీరానికి అధిక మొత్తంలో అందుతుంది. పైన ఉండే తొక్కతో కలిపి తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
బ్రకోలీ : బ్రకోలీలో విటమిన్-సి, ఫైబర్స్ అధికంగా ఉన్నాయి. బ్రకోలీని రుచిగా వివిధ ఆహార పదార్ధాలుగా తయారు చేసి తినొచ్చు. వీటిని రోజువారీ వంటకాల లిస్టులో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలుంటాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
గింజలు : బాదం, వాల్‌నట్, జీడిపప్పు… ఇలా అన్ని రకాల గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొన్ని కొన్ని చొప్పున బాదం, వాల్‌నట్, జీడిపప్పు తదితర గింజలు ఓ కప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Previous articleపెగాసస్ రగడ.. ప్రకటన ప్రతులను చింపేసిన ఎంపీలు
Next articleసిద్ధూ ప్రమాణ స్వీకారానికి అమరీందర్.!