Home జాతీయ వార్తలు ప్రధాని మోడీతో మమతా బెనర్జీ భేటీ

ప్రధాని మోడీతో మమతా బెనర్జీ భేటీ

417
0
Mamatha Benarjee met PM Narendra Modi
Mamatha Benarjee met PM Narendra Modi

ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళ వారం కలుసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె హస్తినకు వచ్చారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించిన తరువాత ఢిల్లీ పర్యటన చేపట్టడంతో దేశ రాజకీయాలపై ఆమె దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రధాని మోడీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర బకాయిలు విడుదల చేయడంతో పాటు టీకాలు తగిన మొత్తం కేటాయించాలని ఆమె కోరనున్నారు.
మే నెలలో ఇరువురు నాయకులు యాస్ తుపాను సమీక్షలో ఇరువురు పాల్గొన్నారు. ఆ సమావేశానికి మమతా బెనర్జీ ఆలస్యంగా రావడం, తిరిగి మధ్యలోనే తిరిగి వెళ్లిపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మమత తో రావడం, ప్రధానితో సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా రాకపోవడంపై కేంద్రం నోటీసులిచ్చింది. ఆయనను రీకాల్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రాజీనామాయే శరణ్యమని భావించిన తరుణంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా అనంతరం మమతా బెనర్జీ నియమించడం ఆసక్తి రేకెత్తించింది.
అనంతరం మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకులతో కూడా సమావేశమయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ తో సమావేశం ఆమె రాజకీయ ఎత్తుగడలను సూచిస్తోంది. ఆమె తన మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో, ఎన్‌సిపి అధినేత‌ శరద్ పవార్ తో, అందుబాటులో ఉన్న ఇతర ప్రతిపక్ష నాయకులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమెతో సమావేశం కానున్నారు. 2024 జాతీయ ఎన్నికలే లక్ష్యంగా బిజెపిని గద్దె దించేందుకు, ప్రతిపక్షాల ఐక్యత కోసం ఆమె ఈ పర్యటన చేపట్టిన విషం బహిరంగమే. బెంగాల్ లో అధికారమే లక్ష్యంగా తమ అన్ని శక్తులను మోహరించి, బీజేపీ తమ విజయానికి సర్వ శక్తులు ఒడ్డిన విషయం తెలిసిందే. అయినప్పటికి వాటన్నింటినీ ఎదురొడ్డి టిఎంసి అధినేత్రి అఖండ విజయం సాధించారు. దీంతో ఐక్యంగా ఉంటే బిజెపిని మట్టికరిపించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు.
ఇదిలా ఉండగా ఆమె ఎంపీ కానప్పటికీ గత వారం తృణమూల్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. కొత్త పాత్ర బెంగాల్‌కు మించిన జాతీయ రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషించటానికి ఆమె సంసిద్ధతను సూచిస్తోంది.

Previous articleఆరోగ్యం కోసం.. ఇవి తింటున్నారా?
Next articleమహేష్ బాబు హీరోగా రామాయణం?