Home సినిమాలు పెళ్లి పీటలెక్కనున్న నయన తార..?

పెళ్లి పీటలెక్కనున్న నయన తార..?

163
0

మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రస్థానం ప్రారంభించి..తెలుగు, తమిళం అనే భాషా బేధం లేకుండా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి నయనతార త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీలైనంత త్వరలోనే నయనతార, విఘ్నేష్లు పేదల ఆశీర్వాదంతో జంట కానున్నట్లు ఫిల్మ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలమైనా.. తన వ్యక్తిగత జీవితంలో వివాదాల ప్రభావం సినీ కెరీర్ పై పడకుండా నయనతార పలు జాగ్రత్తలు తీసుకుంటు వచ్చింది. ఆ కారణంగానే సమకాలీన హీరోయిన్లు ఫేడ్అవుట్ అయినా తాను మాత్రం ఇప్పటికీ అగ్రతారగా ప్రస్థానం కొనసాగిస్తోంది.

వల్లవన్ (తెలుగులో వల్లభ) చిత్రం షూటింగ్ సమయంలో సదరు సినిమా డైరెక్టర్ కం హీరో శింబుతో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత తాను శింబుతో విడిపోయినట్లు నయనతార చెప్పింది. ఆయనతో సినిమాలు కూడా చేయనని పేర్కొంది. ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఈ క్రమంలో పెళ్లి పీటల వరకు వీరి ప్రేమ వచ్చింది. పెళ్లి కోసం తన సినిమా కెరీర్ ను సైతం వదిలి వేస్తుందనే ప్రచారం సాగింది. ఏమైందో తెలీదు కానీ.. వీరి మధ్య ప్రేమ కూడా పెళ్లి పీటలెక్కలేదు. ప్రభుదేవాతో పెళ్లి కోసం క్రిస్టియన్ అయిన నయనతార.. 2011లో హిందువుగా మారింది.

ప్రభుదేవాతో విడిపోయిన నయనతార కొంతకాలానికి దర్శకుడు విఘ్నేశ్ తో ప్రేమలో పడింది. పీకల్లోతు ప్రేమలో ఈ జంట మునిగి తేలుతోంది. విహారయాత్రలతో పటు ఒకరింట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లడం, అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. అయితే ఇటీవలే ఈ జంట ఓ ప్రైవేట్ జెట్ లో కొచ్చిన్ కు వెళ్లారు. నయనతార తండ్రికి అనారోగ్యం కావడంతో ఈ జంట హడావుడిగా వెళ్లారని, ఎప్పటి నుంచో నయన్ ను పెళ్ళి కూతురిగా చూడాలనే కోరికను ఆయన బయట పెట్టగా, పెళ్ళికి నయన్ -విఘ్నేష్ జంట అంగీకారం తెలిపారని సినీ వర్గాల నుంచి సమాచారం. దీంతో పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. దీంతో తమ అభిమాన నటి పెళ్లి వేడుక ఎప్పుడు, ఎక్కడ జరగనుందో అని ఆమె అభిమానులు నెట్ లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.

Previous articleఏ… ఒకసారి చెప్తే అర్ధం కాదా? : ప్రకాష్ రాజ్ పై సీనియర్ నరేష్ సెటైర్
Next articleదాచుకోవడం.. దోచుకోవడం మాకు తెలీదు : షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో విజయమ్మ వ్యాఖ్యలు