Home Technology పెగాసస్ వల్లే ప్రజలకు మంచి నిద్ర : ఎన్ఓఎస్

పెగాసస్ వల్లే ప్రజలకు మంచి నిద్ర : ఎన్ఓఎస్

364
0

తమ సంస్థ తయారు చేసిన స్పై వేర్ పెగాసస్ వల్లే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు సుఖంగా నిద్ర పోగలుగుతున్నారని పెగాసస్ మాతృ సంస్థ ఎన్ఓఎస్ చెప్పింది. తాము రూపొందించిన పెగాసస్ పై పలు దేశాల్లో వివాదం చెలరేగుతుండగా తమని తాము సమర్ధించుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు తాము అందించిన
నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసస్‌ కారణంగానే ఉగ్రవాద నిరోధక చర్యలు పటిష్టంగా ఉన్నట్లు ఈ ఇజ్రాయెల్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చెప్పుకొచ్చింది. తాము ఏ దేశ ప్రభుత్వానికైనా పెగాసస్ ను విక్రయిస్తే దానిని వారే స్వయంగా నిర్వహణ చూసుకుంటారని ఎన్ఓఎస్ పేర్కొంది. సదరు దేశ పౌరుల డేటాను తాము తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Pegasus Spyware Scandal
Pegasus Spyware Scandal

భారతదేశంతో సహా పలు దేశాల్లోని జర్నలిస్టులు, మానవ హక్కుల రక్షకులు, రాజకీయ నాయకులు మరియు ఇతరులపై నిఘా పెట్టడానికి పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించిన సమస్యలపై ఆందోళనలను రేకెత్తించాయి. అంతర్జాతీయ మీడియా కన్సార్టియం ప్రకారం, ఇజ్రాయెల్ సంస్థ వివిధ ప్రభుత్వాలకు విక్రయించిన ఫోన్ స్పైవేర్ తో రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు లక్ష్యంగా వినియోగించినట్లు ఆరోణపణలున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రాత్రి బాగా నిద్రపోతున్నారని, సురక్షితంగా వీధుల్లో సంచరించగలుగుతున్నారని, పెగాసస్ రూపకర్త ఎన్ఓఎస్ సంస్థ ప్రకటించుకుంది. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక ఇతర సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి ప్రభుత్వాలకు సైబర్ ఇంటెలిజెన్స్ ఎన్ఓఎస్ సాధనాలను అందిస్తుందనీ చెప్పింది. సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించడానికి మేము మా వంతు కృషి చేస్తున్నామని తెలిపింది. భారతదేశంలో ఈ స్పై వేర్ ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై స్పందించింది. ఉగ్రవాద నిరోధానికి కాకుండా ఇతర కార్యకలాపాలకు పెగాసస్ ను ఉపయోగిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పింది. తమ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులన్నీ ప్రజల జీవన హక్కు, భద్రత మరియు శారీరక సమగ్రతతో సహా మానవ హక్కుల పరిరక్షణకు వినియోగిస్తున్నామని సంస్థ వివరించింది. ఉగ్రవాదం, తీవ్రమైన నేరాలను నివారించడం కోసమే భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు లైసెన్స్ పొందాయని అని పేర్కొంది.
తాజా వివాదాల మధ్య నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసస్ దుర్వినియోగం అయిందనే ఆరోపణలను సమీక్షించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది లైసెన్స్‌లు ఇచ్చే విధానంపై ప్రభుత్వానికి సమీక్ష చేయనుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Previous articleISC, ICSE ఫలితాలు విడుదల
Next articleవ్యాక్సిన్ల ఉత్పత్తిపై కేంద్రం వేర్వేరు లెక్కలు