Home అంతర్జాతీయ వార్తలు పెగాసస్ దుర్వినియోగంపై కమిటీ : ఇజ్రాయేల్

పెగాసస్ దుర్వినియోగంపై కమిటీ : ఇజ్రాయేల్

255
0
Israel's National Security Council Looking Into Pegasus Spyware Allegations
Israel's National Security Council Looking Into Pegasus Spyware Allegations

తమ దేశ సైబర్ సంస్థ విక్రయించిన స్పైవేర్ ప్రపంచ స్థాయిలో దుర్వినియోగం చేయబడిందనే ఆరోపణలను పరిశీలించడానికి ఇజ్రాయెల్ దేశం ఒక అంతర్గతంగా సీనియర్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ బృందానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి నాయకత్వం వహించనుంది. సంబంధిత నివేదికను జాతీయ భద్రత మండలి ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ కు నివేదిస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ కంటే విస్తృత అధికారాలను కలిగి ఉన్న ఈ భద్రత మండలి ఎన్ఎస్ఓ గ్రూప్ యొక్క పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల వివరాలను పర్యవేక్షించనుంది.

Pegasus Spyware Scandal
Pegasus Spyware Scandal

పెగాసస్ దుర్వినియోగం సంఘటన రక్షణ మంత్రిత్వ శాఖ పరిధికి మించినది అంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫ్రాన్స్, మెక్సికో, ఇండియా, మొరాకో, ఇరాక్ దేశాలలో పెగాసస్ ను దుర్వినియోగం చేసినట్లు ప్రముఖ మీడియా ది వైర్ ఈ వారం నివేదించిన తరువాత దౌత్యపరమైన ఇబ్బందులను ఇజ్రాయెల్ దేశం ఎదుర్కొంది. ఆరోపణలు వచ్చిన వెంటనే పెగాసస్ సృష్టించిన ఎన్‌ఎస్‌ఓ వెంటనే స్పందించలేదు. బెన్నెట్ కార్యాలయం కూడా ఎటువంటి ప్రకటననూ విడుదల చేయలేదు. బుధవారం సైబర్ సమావేశంలో ప్రసంగించినప్పటికీ ఎన్‌ఎస్‌ఓ వ్యవహారంపై ప్రధాని బెన్నెట్ వ్యాఖ్యానించలేదు. సైబర్ భద్రత గురించి ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ దేశాలతో అవగాహన ఒప్పందాలను కలిగి ఉందని, దీనిని “గ్లోబల్ సైబర్ డిఫెన్స్ షీల్డ్” గా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు మాత్రమే సమావేశంలో బెన్నెట్ చెప్పారు.
పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న లాభాపేక్షలేని జర్నలిజం గ్రూప్ ఫర్ బిడెన్ స్టోరీస్ నేతృత్వంలోని 17 మీడియా సంస్థలు ఆదివారం ఈ పెగాసస్ ఉదంతాన్ని ప్రచురించాయి. దర్యాప్తులో భాగంగా పెగాసస్ ను జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేసినట్లు కనుగొన్నారు. అయితే ఈ దర్యాప్తును ఎన్‌ఎస్‌ఓ తిరస్కరించింది. వారి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుడు అంచనాలు, ఊహాగానాలతో రూపొందించారని పేర్కొంది. పెగాసస్ ను ఉగ్రవాదం, నేరాలపై పోరాడటానికి ప్రభుత్వ ఇంటెలిజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మాత్రమే ఉపయోగించాలని ఉద్దేశించినట్లు ఎన్‌ఎస్‌ఓ తెలిపింది.

Previous articleసరిహద్దులో మాటు వేసిన డ్రాగన్
Next articleకాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిద్ధూ ఆతిథ్యం