Home అంతర్జాతీయ వార్తలు పెగాసస్ కార్యాలయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం తనిఖీలు

పెగాసస్ కార్యాలయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం తనిఖీలు

476
0
Israel government raids NSO offices
Israel government raids NSO offices

నిఘా సాఫ్్ట‌వేర్‌ పెగాసస్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఉగ్రవాద చర్యల కట్టడికి వినియోగించాల్సిన ఈ పెగాసస్ ను ప్రముఖులు, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టడానికి ఉపయోగించినట్లు మీడియా సంస్థల కన్సార్టియం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారుల బృందం పెగాసస్ మాతృ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూపు కార్యాలయాలపై గురువారం దాడులు చేశారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు తమ కార్యాలయాలను సందర్శించినట్లు ఎన్ఎస్ఓ ప్రతినిధి ఇజ్రాయెల్ వార్తా వెబ్‌సైట్ ‘ది రికార్డ్’కు తెలిపారు.
తమ సంస్థ పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందని, ఇటీవలి మీడియా తమపై చేసిన తప్పుడు ఆరోపణలకు వ్యతిరేకంగా కంపెనీలో చేపట్టిన ఈ తనిఖీల్లో తమ నిజాయితీ తెలుస్తుందని ఎన్ఎస్ఓ ప్రతినిధి పేర్కొన్నారు.

Pegasus Spyware Scandal
Pegasus Spyware Scandal

భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెగాసస్ ను దుర్వినియోగం చేసిందని, వివిధ ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్తులు, రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారు, వ్యాపారవేత్తలతో సహా 300 మంది మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ లను హ్యాక్ చేశారని ఇటీవల ఒక ప్రపంచ సహకార పరిశోధనా ప్రాజెక్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, రైల్వే & ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ ఫోన్ నంబర్లు కూడా ఉండటం విశేషం. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు మరియు రాజ్యాంగ అధికారంపై నిఘా పెట్టడానికి పెగసాస్ స్పైవేర్ ఉపయోగించబడుతుందనే ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. మీడియా కన్సార్టియం బయట పెట్టిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ భారతీయ ప్రజాస్వామ్యాన్ని కించపర్చేందుకే ఈ ప్రయత్నం అని విమర్శించింది.
ఏది ఏమయినప్పటికీ, దర్యాప్తు కన్సార్టియంలో భాగమైన అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ప్రభుత్వ వాదనలను తప్పుపట్టిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పెగసాస్ ప్రాజెక్ట్ యొక్క ఫలితాలనే వెల్లడించిందని, ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ యొక్క పెగసాస్ స్పైవేర్ ఉపయోగించి ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారని ప్రకటించింది. చట్ట విరుద్ధంగా జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులను పెగాసస్ తో టార్గెట్ చేశారని స్పష్టం చేసింది. పెగాసస్ తో టార్గెట్ చేసిన వ్యక్తుల జాబితాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్, బెంగాల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఉండటంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై పార్లమెంట్ లో తీవ్ర దుమారం రేగగా, ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలు నిరంతరాయంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.

Previous articleరాకేష్ ఆస్థానా మాకొద్దు.. ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
Next articleవైద్య విద్య అడ్మిషన్లలో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ లకు రిజర్వేషన్లు : కేంద్రం