Home జాతీయ వార్తలు పెగాసస్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం : సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

పెగాసస్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం : సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

228
0
Pegasus hearing in SC: Centre denies snooping allegations
Pegasus hearing in SC: Centre denies snooping allegations

పెగాసస్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం : సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం పెగాసస్ వివాదానికి సంబంధించి ప్రభుత్వంపై చేసిన పిటిషనర్లు చేసిన అక్రమ నిఘా ఆరోపణలన్నింటినీ కేంద్రం ఖండించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రెండు పేజీల అఫిడవిట్‌లో తమపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, కోర్టు సిబ్బందిపై దాడి చేయడానికి సైనిక-గ్రేడ్ స్పైవేర్‌ను ఉపయోగించడం గురించి పిటిషనర్లు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నింటినీ కేంద్రం తోసి పుచ్చింది. పెగాసస్ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి నిఘా కోసం 300లు కంటే ఎక్కువ భారతీయ మొబైల్ ఫోన్ నంబర్‌లు హ్యాక్ చేశారని ఒక అంతర్జాతీయ మీడియా కన్సార్టియం నివేదించింది. దీంతో ప్రస్తుతం పెగాసస్ స్నూపింగ్ విషయంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి.

పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలు ఊహాగానాలు, ఆధారాలు లేని మీడియా నివేదికలపై ఆధారపడి ఉంటాయని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. పిటిషనర్లు కొన్ని స్వార్థ ప్రయోజనాల ద్వారా దీనిపై పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. సమస్యలోని అన్ని కోణాల్లోకి వెళ్లడానికి ప్రభుత్వం ఈ రంగంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

పెగాసస్ ఆరోపణలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అంతరాయం సృష్టించింది. ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పెగాసస్ స్పైవేర్‌ని సరఫరా చేసే ఎన్ఎస్ఓ డేటాబేస్ నుంచి సమాచారం లీక్ అయినట్లు అంతర్జాతీయ మీడియా కన్సార్టియం వెల్లడించింది. అందులో భాగంగా ఉన్న మన దేశానికి చెందిన ది వైర్ పెగాసస్ పై కథనాన్ని ప్రచురించగా, అది దేశాన్ని కుదిపేసింది. ది వైర్ కథనం ప్రకారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, విపక్ష నాయకుల ఫోన్‌లు పెగాసస్ లక్ష్యాలుగా ఉన్నట్లు తెలిసింది.

Previous articleగోవాలో వర్షంతో ఎంఎస్ రాజు చిత్రం షెడ్యూల్ ముగింపు
Next articleఇప్పటి వరకు 56.81 కోట్ల కోవిడ్ టీకాలు పంపిణీ : కేంద్రం