Home ఆంధ్ర ప్రదేశ్ పులిచింతలకు నిపుణుల బృందం.. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు

పులిచింతలకు నిపుణుల బృందం.. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు

414
0
Expert team arrives at Pulichintala project to install a stop-lock gate
Expert team arrives at Pulichintala project to install a stop-lock gate

పులిచింతలకు నిపుణుల బృందం.. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు: వరద కారణంగా పులిచింతల ప్రాజెక్ట్ గేట్ విరిగిపోయిన ప్రాంతంలో మరమ్మతు పనులను నీటిపారుదల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నిపుణుల బృందం అక్కడకు చేరుకుంది. రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేసి నీటిమట్టాన్ని తగ్గించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,67,000 క్యూసెక్కుల నీరు ఎగువ నుండి ప్రాజెక్టులోకి ప్రవహిస్తోంది. 19 గేట్లు ఎత్తివేస్తుండగా, 4.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విరిగిన గేటు వద్ద మరమ్మతు పనులను చేపట్టే ప్రక్రియ క్లిష్టతరంగా ఉంది. ఫలితంగా మరో 10 టీఎంసీల నీటిని రిజర్వాయర్‌లోకి వదలాల్సి ఉంటుంది.
మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, స్టాప్ లాక్ ఏర్పాటుపై నిపుణుల బృందం పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంది. వారు తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు, పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో 4.45 లక్షల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే 11,858 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
గేటు విరగడంతో 22 టీఎంసీల నీటిని వదిలామని, ఇంకా 14 టీఎంసీల నీటిని వదిలితే కానీ స్టాప్ లాక్ పెట్టే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నిన్న 16వ గేటు విరిగే సమయానికి 44 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 22.5 టీఎంసీల నీరు ఉంది. నీటి మట్టం 44 అడుగులకు తగ్గి, నీటి మట్టం 8 టీఎంసీల వరకు చేరుకుంటేనే స్టాప్ లాకర్ పెట్టగలమని అధికారులు చెబుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉండే వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దిగువ ప్రాంతాలలో గుంటలు మరియు కాలువలను దాటడానికి ప్రయత్నించవద్దని విపత్తు నిర్వహణ కమిషనర్ మొదటి హెచ్చరిక జారీ చేశారు.

Previous articleరెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ రద్దుకు కేంద్రం మొగ్గు
Next articleఅత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ దరఖాస్తు