Home సినిమాలు పవన్ తో పూరి భారీ చిత్రం?

పవన్ తో పూరి భారీ చిత్రం?

168
0
Pawan Kalyan - Puri Jagannath - Janaganamana Movie
Pawan Kalyan - Puri Jagannath - Janaganamana Movie

పవర్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. ఎవరూ ఊహించని ఒక సరికొత్త, అద్భుత సబ్జెక్టులో పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కోణంలో తనని తాను పరిచయం చేసుకునే పవర్ స్టార్ పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న సినిమా చేయనున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంతో ఇష్టంతో తయారు చేసిన జనగణమన కథను మహేష్ బాబు కోసం దాచి పెట్టారు. అయితే పలు కారణాల వల్ల వారి కాంబినేషన్ లో ఆ సినిమా పట్టాలెక్కలేదు. పూరి జగన్నాథ్ కూడా చాలా సంవత్సరాలు ప్రయత్నించి చూశారు. చివరికి సినిమాను తెలుగులోనే కాకుండా జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని పూరి భావించడంతో కథను పవన్ కు వినిపించినట్లు సమాచారం. ఆయన కూడా ఓకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఇది ఒక వినూత్న చిత్రంగా మారనుంది.

ప్రస్తుతం పవన్ రీ ఎంట్రీ తో ఇండస్ట్రీ లో ఓ రేంజి లో దూసుకుపోతున్నారు. వరుసగా స్టార్ డైరెక్టర్ల చిత్రాలకు ఓకే చెప్పారు. ఈ ఏడాది విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో నటించగా, ఈ సినిమా కరోనా మహమ్మారి సమయంలోనూ మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక పూరి జగన్నాథ్ తో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించగా, ఆ చిత్రానికి ఓ స్టార్ నిర్మాత పేరు వినిపిస్తోంది. ఠాగూర్ మధు దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. పవన్-పూరి కాంబినేషన్ లో పలు చిత్రాలు రాగా అవన్నీ సక్సెస్ ను సాధించాయి. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ నటిస్తున్నారు. ఇది కూడా బహుభాషా చిత్రంగా రూపొందనుంది. అంతేకాకుండా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్, రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమాలకు కూడా పవర్ స్టార్ పచ్చ జెండా ఊపారు.

Previous article‘మా’ ఎన్నికలపై బాలయ్య కీలక వ్యాఖ్యలు
Next articleచైనా దుర్బుద్ధి.. వాస్తవాధీన రేఖ వెంట కాంక్రీటు నిర్మాణాలు