Home జాతీయ వార్తలు పంజాబ్ లో టిఫిన్ బాక్స్ బాంబు.. ఉలిక్కిపడిన నిఘా వర్గాలు

పంజాబ్ లో టిఫిన్ బాక్స్ బాంబు.. ఉలిక్కిపడిన నిఘా వర్గాలు

484
0
IED found inside tiffin box in Amritsar village, cops suspect drone from Pakistan delivered it
IED found inside tiffin box in Amritsar village, cops suspect drone from Pakistan delivered it

పంజాబ్ లో టిఫిన్ బాక్స్ బాంబు.. ఉలిక్కిపడిన నిఘా వర్గాలు చిన్నపిల్లలు తినే టిఫిన్ బాక్సులో ఐఇడి పేలుడు పదార్ధాలతో నింపి కనపడడంతో నిఘా వర్గాలు, పోలీసులు ఉలిక్కి పడ్డాయి. ఆదివారం అమృత్‌సర్‌లోని దలేకే గ్రామ సమీపంలో కనుగొనబడినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో పంజాబ్ డిజిపి దినకర్ గుప్తా ప్రసంగిస్తూ చిన్నారులు వాడే లంచ్ బాక్స్ ను తాము కనుగొన్నామన్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా సరఫరా చేస్తుండగా పడిపోయినట్లు భావిస్తున్నామన్నారు. ఇది కచ్చితంగా పొరుగు దేశం నుంచే వచ్చినట్లు చెప్పారు. సరుకును వదిలివేసిన తర్వాత డ్రోన్ శబ్దం విన్న సమీప గ్రామంలోని ఒక సర్పంచ్ దీని గురించి పోలీసులకు సమాచారం అందించాడన్నారు.

భారత దేశంలో త్వరలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆగస్టు 15కి ముందు ఏదో ఒకటి చేయాలనే ఒత్తిడిలో ఉన్నాయన్నారు. టిఫిన్ బాక్స్‌తో పాటు, ఐదు హ్యాండ్ గ్రెనేడ్‌లు, తొమ్మిది ఎంఎం పిస్టల్స్‌తో 100 రౌండ్లు బుల్లెట్లు కూడా బ్యాగ్‌లో కనిపించాయని వివరించారు. పేలుడు పదార్థాలను 1 నుండి 7 వరకు ఉన్న ఏడు సంచుల ఫోమ్‌లలో ప్యాక్ చేసినట్లు చెప్పారు. లంచ్ బాక్స్ యొక్క చిత్రాలను ప్రదర్శించారు. దానిలో ఉపయోగించిన మెటీరియల్‌ గురించి వివరించారు. మలేషియాలో తయారు చేసిన రెండు శక్తివంతమైన బ్యాటరీలు, టైమర్ పరికరం , రెండు U- ఆకారపు పారిశ్రామిక-గ్రేడ్ శక్తివంతమైన అయస్కాంతాలతో కూడిన బాంబు తయారు చేశారన్నారు. ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అమాయక పిల్లలే లక్ష్యంగా ఉగ్రవాద చర్యలు ప్రజలకు తెలియపర్చాలని చెప్పారన్నారు.

సమాజంలో హై ప్రొఫైల్ వ్యక్తులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని తాము భావిస్తున్నామన్నారు. అయితే ఉగ్రవాదులు ఎవరిని టార్గెట్ చేసుకున్నారో తెలియదని, నిఘా వర్గాలు దీనిపై కృషి చేస్తున్నారని చెప్పారు. త్వరలో ఎర్రకోటలో 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులు ఇందులో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున, ఎర్రకోట పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిఘా వర్గాలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉంటూ తీవ్రవాదుల చర్యలను జల్లెడ పడుతున్నారు.

Previous articleబూస్టర్ డోస్‌తోనే కరోనాకు అడ్డుకట్ట : ఆంటోనీ ఫౌచీ
Next article20 నెలల్లో కేసీఆర్ ను జైలుకు పంపుతాం : రేవంత్ రెడ్డి