Home జాతీయ వార్తలు పంజాబ్ రాష్ట్ర సలహాదారుగా పీకే రాజీనామా.. దేనికి సంకేతం?

పంజాబ్ రాష్ట్ర సలహాదారుగా పీకే రాజీనామా.. దేనికి సంకేతం?

357
0
Prashant Kishor Resigns As Principal Advisor To Punjab Chief Minister
Prashant Kishor Resigns As Principal Advisor To Punjab Chief Minister

పంజాబ్ రాష్ట్ర సలహాదారుగా పీకే రాజీనామా.. దేనికి సంకేతం?: వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ముఖ్య సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా చేశారు. 2022 రాష్ట్ర ఎన్నికల్లో తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. అమరీందర్ సింగ్‌కు రాసిన లేఖలో ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుండి తాత్కాలిక విరామం తీసుకుంటున్నాను” అని పీకే పేర్కొన్నాడు. అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసే పనిలో ప్రశాంత్ కిషోర్ తలమునకలయ్యారు. వివిధ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకు రావడంలో భాగంగా వివిధ రాజకీయ పక్షాలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగానే రాజీనామా చేసినట్లు పలువురు భావిస్తున్నారు.
మీకు తెలిసినట్లుగా, ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుండి తాత్కాలిక విరామం తీసుకోవాలనే నా నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను మీ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా బాధ్యతలు స్వీకరించలేకపోయాను. నా భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. , ఈ బాధ్యత నుండి నన్ను విముక్తి చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అని ప్రశాంత్ కిశోర్ లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూతో ప్రస్తుతం వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రాజీనామా ముఖ్యమంత్రి అమరీందర్ కు శరాఘాతమని చెప్పాలి. అయితే రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పీకే చేపడుతారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ లో ఒకే వ్యక్తి రెండు పదవులు ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ క్రమంలోనే సలహాదారు పదవికి రాజీనామా చేశారని కొందరు చెప్తున్నారు.
బెంగాల్‌లో మమతా బెనర్జీ విజయం, 2024 జాతీయ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు కిశోర్ దిక్సూచి గా మారాడు. కిషోర్ సలహాలను పాటిస్తున్న మమతా బెనర్జీ, ఇటీవల తన ఎన్నికల విజయం తర్వాత ఢిల్లీకి తన మొదటి పర్యటన చేశారు మరియు బెంగాల్ దాటి ఒక పెద్ద రాజకీయ పాత్ర కోసం తాను సిద్ధంగా ఉన్నారనే సంకేతాల మధ్య రాజకీయంగా ముఖ్యమైన చర్చలు జరిపారు. బెంగాల్ ముఖ్యమంత్రి ఢిల్లీలో మిస్టర్ కిషోర్‌ని కూడా కలిశారు.
ఏదేమైనా కాంగ్రెస్ కు వివిధ రాష్ట్రాల్లో క్యాడర్ ఉన్నప్పటికి సరైన వ్యూహాలు లేక ఎన్నికల వేళ చతికిల పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో మెరుగైన సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు సాధించినా, అధికారానికి దూరమవుతూ వస్తోంది. ముఖ్యంగా గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీయే ఎన్నికల్లో మంచి ఫలితాలనే ఆ పార్టీ సాధించింది. అయినా అధికారాన్ని చేపట్టలేకపోవడం విచారకరమని చెప్పాలి. ఇక రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండుసార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇటువంటి తరుణంలో తాను సలహాలిచ్చిన పార్టీలకు అఖండ విజయాలను కట్టబెడుతున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం బిజెపిపై తన మాటల తూటాలతో విరుచుకుపడుతున్న ప్రశాంత్ కిషోర్ దేశం లోని ప్రతి పక్ష పార్టీలకు మార్గదర్శిగా మారాడు. అటువంటి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయనడంలో సందేహం లేదు.

Previous articleజయహో భారత్.. ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు
Next articleజగనన్న పచ్చతోరణం ప్రారంభం