Home రాజకీయం పంజాబ్ కాంగ్రెస్ భవన్ లో మంత్రులు కూర్చోవాలి : సిద్ధూ ప్రతిపాదన

పంజాబ్ కాంగ్రెస్ భవన్ లో మంత్రులు కూర్చోవాలి : సిద్ధూ ప్రతిపాదన

270
0
Navjot Sidhu's
Navjot Sidhu's "Positive" Meet With Captain Who Complained Against Him

పంజాబ్ కాంగ్రెస్ భవన్ లో మంత్రులు కూర్చోవాలి : సిద్ధూ ప్రతిపాదన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా గత నెలలో నియమితులైన నవజోత్ సింగ్ సిద్దూ.. రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి ప్రణాళికలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల విషయంలో నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీయే ఎన్నికలే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు పంజాబ్ కాంగ్రెస్ భవన్ లో రోస్టర్ ప్రకారం వచ్చి కూర్చోవాలని అల్టిమేటం జారీ చేశారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవ కలుసుకున్నారు. పార్టీలో తనకు కొరకరాని కొయ్యగా మరీనా నవజ్యోత్ సింగ్ సిద్ధూ “బార్బ్స్” విధానాలపై ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన వారం తర్వాత, సిద్ధూ ఈ ఉదయం ఒక అరుదైన సంకేతం వచ్చేలా ట్వీట్ చేశారు. పంజాబ్ కాంగ్రెస్ భవన్‌లో మంత్రుల రోస్టర్ కూర్చోవాలనే ప్రతిపాదనపై అత్యంత సానుకూల సమన్వయ సమావేశం చేపట్టినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను కలవాలని తాను ప్రతిపాదించానని సిద్ధూ చెప్పారు.

పార్టీ కార్యకర్తలు మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మెరుగైన సమన్వయం కోసం 10 మంది సభ్యుల వ్యూహాత్మక విధాన సమూహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధు దీనికి అంగీకరించారని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అనంతరం ఈ ఇరువురు నాయకులు కూర్చుని, కొన్ని అంతర్గత సమస్యలపై చర్చించుకున్నారు. ఈ భేటీ సామరస్యంగా జరిగింది. ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం వారానికోసారి సమావేశాలు నిర్వహించనుంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు వేగవంతం చేయడంపై ఈ బృందం దృష్టి పెడుతుంది. ప్రతిరోజూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలను కలిసే పనిని రాష్ట్ర మంత్రులకు అప్పగించారు.

గత వారం, ఢిల్లీలో సోనియా గాంధీ-అమరీందర్ సమావేశం సందర్భంగా కొన్ని సూచనలు అధిష్టానం నుంచి వచ్చాయని తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ – రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి పనిచేయాలని, అడ్డగోలు ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాభిమానాన్ని సంపాదించాలని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ పంజాబ్ ఇంచార్జ్ హరీష్ రావత్ చెప్పారు. పంజాబ్ లోని ఇద్దరు నాయకులకూ సమన్వయం పాటించాలని సూచించినట్లు తెలిసింది. పంజాబ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందుగానే ఈ సమావేశం జరిగింది.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత నెలలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులయ్యారు. అనంతరం కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొత్త బాధ్యతలు స్వీకరించి నెల రోజుల తర్వాత కూడా, ఎన్నికల ముందు హామీలను నెరవేర్చనందుకు ప్రభుత్వాన్ని సిద్ధూ నిలదీస్తున్నారు. పంజాబ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017లో వచ్చిన అఖండ విజయాన్ని పునరావృతం చేయాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే పార్టీలో కుమ్ములాటలు ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలో ఉంది. దీనిని సరిదిద్ధేందుకు ఆ పార్టీ అధిష్టానానికి కష్టతరంగా మారింది.

Previous articleఒలింపిక్ క్రీడాకారులపై యూపీ సీఎం కానుకల వర్షం
Next articleకొండపొలం ఫస్ట్ లుక్.. సరి కొత్తగా వైష్ణవ తేజ్