Home జాతీయ వార్తలు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా సిద్ధూ?

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా సిద్ధూ?

132
0
Sidhu Appointed as Punjab PCC Chief
Sidhu Appointed as Punjab PCC Chief

పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి స్వస్తి పలికి, పార్టీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దూ మధ్య సయోధ్య కుదిర్చేలా ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫార్ములాలో కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా, సిద్దూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలనే నిర్ణయంతో వారిరువురి మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్ కూడా ఒకటి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య అభిప్రాయం భేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఈ క్రమంలో వారిరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయికి అవి చేరుకున్నాయి. క్యాబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రి పదవిని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆఫర్ చేసినా సిద్ధూ తిరస్కరించడం, పీసీసీ పదవిలో ఆయన ఆశించడం వంటివి ఇటీవల కాలంలో జరుగుతూ వచ్చాయి. సిద్ధూ కు పీసీసీ పదవి ఇవ్వడం ఇష్టం లేని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దానికి అడ్డుపుల్ల వేస్తూ వచ్చారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం చేసే కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల కాలంలో దూకుడైన నిర్ణయాలు తీసుకుంటుంది. వివిధ రాష్ట్రాలలో పార్టీలో సీనియర్లను కాదని పార్టీని పటిష్టం చేసే నేతలకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ లో నవజ్యోత్ సింగ్ సిద్దూ కు పీసీసీ అధ్యక్షా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం. మరి కొన్ని నెలల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీసీసీ టీం నియామకానికి కసరత్తులు చేసింది. రాష్ట్రంలో పెద్ద నేతలైన కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ ల మధ్య సయోధ్య కుదుర్చుతూనే సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ లో అనిశ్చితి, ప్రతిష్టంభనకు తెర దించేలా పీసీసీ కూర్పు చేపట్టింది. పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పీసీసీ టీమ్ ను ప్రకటించనుంది. హిందూ, దళిత వర్గాలకు చెందిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించేందుకు చర్యలు తీసుకోనుంది. దీనిపై ఇంకా కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Previous articleరాజద్రోహం చట్టం.. అవసరమా? : సుప్రీం కోర్టు
Next articleసెకండ్ వేవ్ ను యూపీ సమర్ధవంతంగా ఎదుర్కొంది : మోడీ