Home సినిమాలు నేనూ.. లవ్ ఫెయిల్యూర్ నే : అనుపమ పరమేశ్వరన్

నేనూ.. లవ్ ఫెయిల్యూర్ నే : అనుపమ పరమేశ్వరన్

162
0
Anupama Parameshwaran Love Breakup
Anupama Parameshwaran Love Breakup

తన నవ్వులతో కుర్రకారు మదిలో వీణలు మీటించే అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కూడా ప్రేమలో విఫలమయ్యారనే విషయం మీకు తెలుసా.. నిజమేనండోయ్. అనుపమ కూడా ఓ వ్యక్తిని గాఢంగా ఇష్టపడ్డారట. అయితే తన ప్రేమ విషాదాంతమైందని, అది మధ్యలోనే ఆగిపోయిందని అనుపమ ఎంతో బాధతో చెప్తోంది.
మలయాళ సినిమా ప్రేమంతో సినీ రంగ ప్రవేశం చేసిన అనుపమ తొలి సినిమాతోనే ఎంతో మందిని ఆకర్షించింది. ‘అ ఆ’ సినిమాలో నితిన్ తో జోడీ కట్టి తెలుగు సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. తెలుగులో తొలి సినిమాలోనే తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పి ఔరా అనిపించింది. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడటంతో పాటు పాటలు పాడుతోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ భామ.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఈ క్రమంలో అభిమానుల కామెంట్లకు బదులిస్తూ, తన నిజ జీవితంలో విషయాలను పంచుకుంది.

Anupama Parameshwaran Love Breakup

ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. తాను గతంలో ఒకరిని గాఢంగా ప్రేమించానని, అయితే మధ్యలోనే తమకు బ్రేకప్ అయిందనీ చెప్పుకొచ్చింది. తాను అమ్మ చేతి రుచులను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తానని, సింగింగ్ కూడా తన వ్యాపకాలలో ఒకటని చెప్పింది. తాను బ్రష్ పట్టి పెయింటింగ్ లు సైతం వేస్తున్నానని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. మనసుకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఎంతో ప్రశాంతత ఉంటుందని ఈ మలయాళ కుట్టి చెప్తోంది.
ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిందామె. అయితే అనుపమ ఓ తెలుగు హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందని వార్తలు చక్కర్లు కొట్టినా.. అవన్నీ పుకార్లేనని ఆమె కొట్టి పారేసింది.

Previous articleహార్లే డేవిడ్ సన్ నుంచి ఎలక్ట్రిక్ బైక్
Next articleఒలింపిక్స్.. జరిగి తీరుతాయి : ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్