Home సినిమాలు నా భర్త అమాయకుడు : శిల్పాశెట్టి

నా భర్త అమాయకుడు : శిల్పాశెట్టి

344
0
My Husband Innocent
My Husband Innocent": Shilpa Shetty

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన తన భర్త అమాయకుడని ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెప్పారు. సదరు కేసులో తనను విచారిస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ అధికారులకు పై విధంగా వెల్లడించారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్ లలో ఉన్న వీడియోల మాదిరిగానే తన భర్త శృంగార వీడియోలను రూపొందించారని పోలీసులకు ఆమె సమాధానమిచ్చారు. వాటిలో అశ్లీలతకు తావు లేదని స్పష్టం చేశారు. అయితే ‘హాట్‌షాట్స్’ యాప్ గురించిన కచ్చితమైన సమాచారం తనకు తెలియదని చెప్పారు.
హాట్‌షాట్స్ మొబైల్ యాప్ ద్వారా ఆమె భర్త రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్న కుంద్రా యొక్క బావమరిది, లండన్‌కు చెందిన ప్రదీప్ బక్షికి హాట్‌షాట్స్ లో ప్రమేయం ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. శృంగారం, అశ్లీలత మధ్య వ్యత్యాసాన్ని కూడా ఆమె పోలీసులకు వివరించారని, అశ్లీల వీడియోలను ఉత్పత్తి చేసే ప్రక్రియలో తన భర్త రాజ్ కుంద్రా పాల్గొనలేదని ఆమె అన్నారు. శుక్రవారం శిల్పాశెట్టి ని ప్రశ్నించిన పోలీసులు, ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.

రాజ్ కుంద్రాను జూలై 27 వరకు పోలీసు కస్టడీకి న్యాయస్థానం పంపింది. అనంతరం శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఇంట్లో పోలీసులు సోదాలు జరిపి సుమారు 48 టిబి విలువైన చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ అశ్లీలతతో కూడుకున్నావని పొలిసు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా వీటికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను తాము సంపాందించమని పోలీసులు చెబుతున్నారు. ఈ అశ్లీల వీడియోల ద్వారా వచ్చిన డబ్బులను రాజ్ కుంద్రా ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ .7.5 కోట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం విచారణ సందర్భంగా రాజ్ కుంద్రా తరుపు న్యాయవాది అబాద్ పోండా స్వాధీనం చేసుకున్న వీడియోలను ‘అశ్లీలత’ గా పోలీసులు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నెట్‌ఫ్లిక్స్ వంటి ఒటిటి ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి వీడియోలు అందుబాటులో ఉన్నందున, ఐటి చట్టంలోని సెక్షన్ 67 కింద ఈ కంటెంట్ రాదని న్యాయవాది వాదించారు. ఇక తన అరెస్టును సవాలు చేస్తూ, పోలీసు కస్టడీని పొడిగించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని బొంబాయి హైకోర్టును రాజ్ కుంద్రా ఆశ్రయించారు. 45 ఏళ్ల రాజ్ కుంద్రా ఈ కేసులో “కీలక కుట్రదారుడు” అని పోలీసులు చెబుతున్నారు.

Previous articleశభాష్ మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ
Next articleISC, ICSE ఫలితాలు విడుదల