Home రాజకీయం నర్మగర్భంగా యెడియూరప్ప వ్యాఖ్యలు.. మార్పు తథ్యమేనా?

నర్మగర్భంగా యెడియూరప్ప వ్యాఖ్యలు.. మార్పు తథ్యమేనా?

274
0
Will Yediyurappa resign to CM?
Will Yediyurappa resign to CM?

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు విషయమై వివిధ ఊహాగానాలు వస్తున్న వేళ.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న యెడియూరప్ప నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా తాను సిఎం కుర్చీ దిగేది లేదంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి భిన్నంగా గురువారం ట్విట్టర్ పెట్టిన ఓ ట్వీట్.. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తప్పుకునేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.
“నేను బిజెపికి విధేయుడిగా పని చేశాను. నిజాయితీగా, క్రమశిక్షణతో అత్యున్నత ప్రమాణాలున్న బిజెపి పార్టీకి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీకి ఇబ్బంది కలిగించే ఎటువంటి నిరసనలను ఎవరూ చేపట్టకూడదని నేను కోరుతున్నాను” అంటూ యెడియూరప్ప ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎట్టకేలకు ఈ నెల 26 తర్వాత ఆయన తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి మార్పుపై బెంగళూరులో విలేకరులతో యెడియూరప్ప మాట్లాడారు. జూలై 25 తర్వాత మాత్రమే ఏం జరుగుతుందో తెలుస్తుందని, బిజెపి అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా తాను కట్టుబడి ఉంటానని యెడియూరప్ప చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి, కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని వివరించారు.

Yediyurappa Clarify his Resignation to CM
Yediyurappa Clarify his Resignation to CM

ఈ నెల 25 న ఎమ్మెల్యేలు, సచివాలయ సిబ్బందికి విందు, 26 పార్టీ శాశన సభాపక్ష సమావేశానికి హాజరు కావడాన్ని తన షెడ్యూల్ గా యెడియూరప్ప నిర్ణయించారు. ప్రస్తుతం దానిని సవరించినట్లు సమాచారం. తన రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠం నుంచి యెడియూరప్ప తొలగనున్నారనే వార్తలను పలువురు విశ్వసిస్తున్నారు. ఇటీవల యెడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే బిజెపి పార్టీలో 75 ఏళ్ళు దాటిన వారికి ఎలాంటి పదవులు లేవని, అయితే తనను మాత్రం 78 ఏళ్ళు వచ్చినా, తమ అధినాయకత్వం కొనసాగించిందని చెప్పారు. ఈ తరుణంలోనే యెడియూరప్ప ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలను కలుసుకున్నారు. తన కుమారులకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కల్పిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని యెడ్డీ పేర్కొన్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే కర్ణాటకలో బలమైన తన సామజిక వర్గం లింగాయత్ మద్దతు యెడియూరప్పకు బలంగా ఉంది. యెడియూరప్ప ను తొలగిస్తే వారి మద్దతును కోల్పోతామనే ఆలోచన బిజెపి అధిష్టానానికి ఉంది. వారి మద్దతు పోగొట్టకుండానే కర్ణాటకలో మరో బలమైన ఒక్కళిగ సామాజిక తరగతి మద్దతును కూడా పొందాలని బీజేపీ కేంద్ర నాయకత్వం యోచిస్తోంది. ఏదేమైనా ముఖ్యమంత్రి మార్పు చేపడితే వచ్చే ఎన్నికల్లో యెడియూరప్ప తరహాలో పార్టీని నడిపించే బలమైన నాయకుడి కోసం బిజెపి అన్వేషణ సాగిస్తోంది.

Previous articleసాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతుల నిరసన
Next articleపెగాసస్ రగడ.. ప్రకటన ప్రతులను చింపేసిన ఎంపీలు