Home National News దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులకు అవకాశం : భద్రత ఏజెన్సీల హెచ్చరిక

దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులకు అవకాశం : భద్రత ఏజెన్సీల హెచ్చరిక

361
0
Lashkar, Jaish planning major attacks on August 15, forces on high alert
Lashkar, Jaish planning major attacks on August 15, forces on high alert

దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులకు అవకాశం : భద్రత ఏజెన్సీల హెచ్చరిక స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులకు అవకాశం ఉందంటూ భద్రత ఏజెన్సీల హెచ్చరిక జారీ చేశాయి. భద్రత బలగాలు, వారి కేంద్రాలను పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయనే సమాచారాన్ని సేకరించాయి.

ఇందుకు గాను విస్తృతమైన ప్రణాళికలను ఉగ్రవాద సంస్థలు రూపొందించాయని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దేశంలోకి చేరవేశాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లష్కరే తోయిబా, జైష్-ఇ-మహ్మద్‌తో సహా తీవ్రవాద సంస్థలు భారీ ఉగ్రదాడులను ప్లాన్ చేస్తున్నాయని ఇంగ్లీషు వార్తా సంస్థలతో నిఘా వర్గాలు చెప్పాయి. కాశ్మీర్ నుండి ఢిల్లీ వరకు భద్రతా సంస్థలు గత వారం రోజులుగా జల్లెడ పడుతున్నాయి. భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చేరవేసి, ఉగ్ర దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాలు తెలిపాయి.

కీలక సంస్థలు, సెక్యూరిటీ ఇన్‌స్టాలేషన్‌లు, ఫార్వర్డ్ పోస్ట్‌లు, రక్షణ దళాలు లక్ష్యంగా ఉన్నాయని, దాడులకు అధునాతన ఐఇడి వంటి పేలుడు పదార్ధాలను కూడా ఉపయోగించవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో ఆంగ్ల మీడియా సంస్థ ఇండియా టుడే కీలక సమాచారం సేకరించింది. ఇందులో లష్కర్, జైష్ ఉగ్రవాదుల ఆగష్టు 15 నాటికి ఢిల్లీతో సహా భారత భూభాగంలోకి చొరబడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదుల ప్రణాళికలు ఎలా ఉండొచ్చు?
మొదటగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
శత్రు దేశం పాకిస్తాన్‌ నుంచి గత వారం రోజులుగా ఉగ్రవాద దాడులు చేయడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఇడిలను భారత దేశంలోకి చేరవేశారు. పంజాబ్, జమ్మూ-కాశ్మీర్‌లోని భద్రతా దళాలు గత నెలలో ఆయుధాలు సరఫరా చేస్తున్న డ్రోన్ లను అడ్డుకున్నాయి. వ్యక్తిగత లక్ష్యాల కోసం చిన్న ఆయుధాలను ఉపయోగించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. This can be used key to get more detailed information on the subject of play free pokies.

ఒక ప్రత్యేక రకం ఐఇడి దేశానికి సరఫరా చేయబడిందని, దీనిని బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ఉపయోగించవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2 నుంచి 3 కిలోల ఆర్‌డిఎక్స్ తో తయారు చేసిన పేలుడు పరికరాలు (IED) స్ప్రింగ్ మరియు టోగుల్ స్విచ్ ఆధారిత ప్రెజర్ మెకానిజం లేదా ప్రింటెడ్ సర్క్యూట్ ద్వారా ప్రారంభించబడతాయి. ఐఇడి మ్యాన్‌హ్యాండిల్ చేయబడి, అయస్కాంతం ఒకదానికొకటి అంటుకుని, సర్క్యూట్ పూర్తయిన సందర్భంలో రెండు కొద్దిగా దూరమైన అయస్కాంతాలను కూడా ఉంచవచ్చు. ఇటువంటి ఐఇడిలు ఇప్పటికే దేశంలోకి అక్రమంగా రవాణా చేయబడ్డాయి.

ముప్పు దృష్ట్యా అనుమానాస్పద వస్తువులతో గుర్తు తెలియని వ్యక్తులు తారస పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్థానిక పోలీసులు, పారామిలిటరీ దళాలు, రాష్ట్ర నిఘా అధికారులు సూచిస్తున్నాయి.

కమాండర్ మొహమ్మద్ సాదిక్ నాయకత్వంలో ఆరుగురు లష్కర్ కమాండర్లు ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోటిల్‌లో ఉన్నారు. ఆగస్టు 15 నాటికి దేశంలోకి చొరబడి భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

ఐదుగురు జైష్ ఉగ్రవాదులు బాలకోట్ అంతటా పిఓకెలో కూడా క్యాంప్ చేస్తున్నారు. వీరు భద్రతా దళాల స్థావరాల దగ్గర ఐఇడిలతో పేలుడును ప్లాన్ చేస్తున్నారు.

మరో నలుగురు లష్కర్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం వారు పిఓకెలోని తుండ్వాలా అటవీ ప్రాంతంలో విడిది చేశారు. తరువాత కాశ్మీర్ లోయకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

For Latest News

Previous articleఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్యే : రాహుల్ గాంధీ
Next articleసుప్రీం న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ పదవీ విరమణ