Home జాతీయ వార్తలు దీదీ.. నేరుగా రంగంలోకి!

దీదీ.. నేరుగా రంగంలోకి!

346
0
Mamatha Benarjee working as TMC New Parliamentary Chief
Mamatha Benarjee working as TMC New Parliamentary Chief

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ శుక్రవారం దీనిపై ప్రకటన చేశారు. వచ్చే వారం దీదీ ఢిల్లీ పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై ఆమె దృష్టి సారించనున్నారని డెరెక్ ఓబ్రియన్ పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించకుండా తమ పార్టీ పార్లమెంటరీ బృందానికి నాయకత్వం వహించిన కొద్దిమంది రాజకీయ నాయకులలో ఎంపి సుదీప్ బందోపాధ్యాయ, మమతా బెనర్జీ ఉన్నారన్నారు. 1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినప్పుడు పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించిన విషయం గుర్తు చేశారు.
మమతా బెనర్జీ తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ అవనున్నారని, ఇది తాము లాంఛనప్రాయంగా చెబుతున్న వాస్తవమని చెప్పారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపిగా పని చేశారని, ఆమె ఇప్పటికే పార్లమెంటరీ పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్నారని వివరించారు. ఇది తమ పార్టీ వ్యూహాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. పెగసాస్ స్నూపింగ్ కుంభకోణంపై ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన ప్రతులను చింపివేసినందుకు ఇప్పటికే తృణమూల్ ఎంపి డాక్టర్ సంతను సేన్ ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటికే రాజకీయ దుమారాన్ని రేపింది. దీంతో నేరుగా ఆ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. బిజెపిని ఎదుర్కొనేందుకు, జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Previous articleమార్కెట్ లోకి నోకియా 4జి ఫీచర్ ఫోన్
Next articleశభాష్ మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ