Home Technology తాలిబన్ అనుకూల పోస్టులపై ఫేస్ బుక్ నిషేధం

తాలిబన్ అనుకూల పోస్టులపై ఫేస్ బుక్ నిషేధం

229
0
Facebook Bans Accounts, Content Supporting Taliban
Facebook Bans Accounts, Content Supporting Taliban

తాలిబన్ అనుకూల పోస్టులపై ఫేస్ బుక్ నిషేధం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాజాగా తాలిబాన్లను, వారికి మద్దతు ఇచ్చే అన్ని కంటెంట్‌లను నిషేధించినట్లు పేర్కొంది. ఎందుకంటే తాలిబన్లను తీవ్రవాద సంస్థగా ఫేస్ బుక్ పరిగణిస్తుంది. తిరుగుబాటు బృందానికి సంబంధించిన కంటెంట్‌ని పర్యవేక్షించడానికి, తీసివేయడానికి ఆఫ్ఘన్ నిపుణుల ప్రత్యేక బృందం తమ వద్ద ఉందని కంపెనీ చెబుతోంది. కొన్నేళ్లుగా, తాలిబాన్ తన సందేశాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తోంది.

“యుఎస్ చట్టం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థగా ముద్ర పడింది. తమ ఆర్గనైజేషన్ విధానాల ప్రకారం తాము వారిని మా సేవల నుండి నిషేధించాము. దీని అర్థం .. మేము తాలిబాన్ లకు చెందిన, వారి తరపున నిర్వహించే ఖాతాలను తీసివేస్తాము. వారికి ప్రశంసలు, మద్దతు, ప్రాతినిధ్యాన్ని నిషేధిస్తాము” అని ఫేస్‌బుక్ ప్రకటించింది.

తమ వద్ద ఆఫ్ఘనిస్తాన్ నిపుణుల ప్రత్యేక బృందం కూడా ఉందని, వారు స్థానిక దరి, పాష్టో మాట్లాడతారని, స్థానిక సందర్భం గురించి పరిజ్ఞానం కలిగి ఉంటారని ఫేస్ బుక్ పేర్కొంది. తమ సోషల్ మీడియా ద్వారా సమస్యలను గుర్తించడానికి, అప్రమత్తం చేయడానికి వారు తమకు సహాయపడతారని ఫేస్ బుక్ పేర్కొంది. తాము జాతీయ ప్రభుత్వాల గుర్తింపు గురించి నిర్ణయాలు తీసుకోమని, బదులుగా అంతర్జాతీయ సమాజం యొక్క అధికారాన్ని అనుసరిస్తామని చెప్పారు.

ఈ విధానం తన ఫ్లాగ్‌షిప్ సోషల్ మీడియా నెట్‌వర్క్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తో సహా అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు వర్తిస్తుందని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. అయితే, తాలిబన్లు తమలో తాము కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. యాప్‌లోని అకౌంట్‌లు గ్రూప్‌తో లింక్ చేయబడితే అది చర్యలు తీసుకుంటుందని ఫేస్‌బుక్ బిబిసికి తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం హృదయ విదారక పరిస్థితులు ఏర్పడ్డాయి. తాలిబాన్ తిరుగుబాటుదారులు కాబూల్‌ని మూసివేసి, అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీని దేశం విడిచి పారిపోయారు.

Previous articleలూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ?
Next articleమార్కెట్ లో మోటరోలా స్మార్ట్ ఫోన్లు.. కళ్ళు చెదిరే ఫీచర్లు