Home Covid 19 డెల్టా వేరియంట్ పై స్పుత్నిక్-వి ప్రభావం 83 శాతం : రష్యా

    డెల్టా వేరియంట్ పై స్పుత్నిక్-వి ప్రభావం 83 శాతం : రష్యా

    410
    0
    Sputnik V vaccine 83% effective against Delta variant of coronavirus
    Sputnik V vaccine 83% effective against Delta variant of coronavirus

    డెల్టా వేరియంట్ పై స్పుత్నిక్-వి ప్రభావం 83 శాతం : రష్యా ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న డెల్టా వేరియంట్ పై తాము రూపొందించిన స్పుత్నిక్ – వి వ్యాక్సిన్ 83 శాతం ప్రభావం చూపుతోందని రష్యా ప్రకటించింది. ఈ మేరకు స్పుత్నిక్ – వి విడుదలయి ఏడాది పూర్తయిన సందర్భంగా రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో బుధవారం మీడియాతో మాట్లాడారు. డెల్టా వేరియంట్ తో పాటు కరోనావైరస్ యొక్క అన్ని రూపాలపైనా స్పుత్నిక్ – వి వ్యాక్సిన్ సమర్ధంగా పని చేస్తుందని చెప్పారు.

    “ఈ రోజు, స్పుత్నిక్ – వి వ్యాక్సిన్ డెల్టా వేరియంట్ నివారణపై అత్యంత ప్రభావవంతమైన ఫలితాలను ప్రదర్శించింది. తాజా ఫలితాలు సమర్థత దాదాపు 83 శాతం ఉందని సూచిస్తున్నాయి. ఇది ఇప్పటికే రష్యన్ డేటా, మా క్లినికల్ సహోద్యోగుల సౌజన్యంతో మాకు అందించబడింది” అని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో రష్యన్ న్యూస్ ఏజెన్సీ టిఏఎస్ఎస్ కు తెలిపారు. స్పుత్నిక్ – వి టీకా పొందితే తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన ప్రమాదం తప్పుతుందని చెప్పారు.

    కొత్త స్ట్రెయిన్స్ పై ప్రభావం
    స్పుత్నిక్ – వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమాలయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ & మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ కూడా మీడియాతో మాట్లాడారు. స్పుత్నిక్ – వి కరోనావైరస్ కు చెందిన అన్ని కొత్త వేరియంట్ లకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిందన్నారు. స్పుత్నిక్ – వి టీకా పూర్తిగా సురక్షితమైనదని, అత్యంత ప్రభావవంతమైనదని ఆయన చెప్పారు. ఇప్పటికే విజృంభిస్తున్న కరోనా వేరియంట్ లతో పాటు, కొత్తగా వచ్చే వారియంట్లపైనా స్పుత్నిక్ – వి ప్రభావం చూపుతుందని ప్రకటించారు.

    “స్పుత్నిక్-వి” విడుదలయ్యి ఏడాది పూర్తి
    గతేడాది ఆగస్టు 11న రష్యాలో స్పుత్నిక్ – వి రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో ఈ వ్యాక్సిన్ మొదటి వార్షికోత్సవాన్ని నేడు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై పోరాడే వ్యాక్సిన్ లలో మొదటి అధికారిక టీకాగా గుర్తింపు పొందింది. 2020 చివరిలో బెలారస్‌కు డెలివరీలతో ఇతర దేశాలకు స్పుత్నిక్ – వి ఎగుమతి ప్రారంభమైంది. 2021 ఆగష్టు నాటికి 69 దేశాలలో ఆమోదించబడింది. ఈ టీకాను 50కి పైగా దేశాలలో ఉపయోగిస్తున్నారు.

    భారతదేశంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఐదు కోవిడ్ వ్యాక్సిన్లలో స్పుత్నిక్ – వి కూడా ఒకటి.

    For More News

    Previous articleటీకా పొందిన వారికీ కరోనా.. కేరళలో టెన్షన్
    Next articleఒబిసి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం