Home క్రీడలు టోక్యో ఒలింపిక్స్ లో.. దుమ్ము రేపుతున్న భారత క్రీడాకారులు

టోక్యో ఒలింపిక్స్ లో.. దుమ్ము రేపుతున్న భారత క్రీడాకారులు

408
0
Wrestler Ravi Dahiya In Tokyo Olympics Final
Wrestler Ravi Dahiya In Tokyo Olympics Final

టోక్యో ఒలింపిక్స్ లో.. దుమ్ము రేపుతున్న భారత క్రీడాకారులు: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన క్రీడాకారులు అదరగొడుతున్నారు. రెజ్లింగ్ లో రవికుమార్ దహియా కజకిస్తాన్‌కు చెందిన నూరిస్లామ్ సానాయేవ్‌పై గెలిచి పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్ కు వెళ్ళాడు. కనీసం రజత పతకాన్ని భారత్ ఖాతాలో వేయనున్నాడు. ఫలితంగా రెజ్లింగ్ లో భారత్ ఒలింపిక్ వేదికగా సత్తా చాటనుంది.
బుధవారం భారత క్రీడాకారుల ఫలితాలు ఇలా ఉన్నాయి. మహిళల వెల్టర్ వెయిట్ సెమీ ఫైనల్లో టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలి చేతిలో ఓడిపోవడంతో లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. రెజ్లర్ అన్షు మాలిక్ తన మొదటి రౌండ్ పోటీలో బల్గేరియాకు చెందిన ఇరినా కురాచ్కినా 2-8తో ఓడిపోగా, పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ క్వార్టర్‌ఫైనల్లో రవి దహియా 13-2 తేడాతో కొలంబియాకు చెందిన టిగ్రెరోస్ అర్బానోపై విజయం సాధించాడు. తరువాత దీపక్ పునియా పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీల క్వార్టర్ ఫైనల్ లో నైజీరియాకు చెందిన ఎకెరెకెర్నే అగిర్‌నార్‌ను 12-1తో ఓడించి సెమీ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు.
నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో 12వ రోజుకి భారతదేశం మంచి ప్రారంభాన్ని అందించాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో ఫైనల్ పోరుకు దూసుకెళ్లాడు. అర్హత పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 86.65 మీ. విసిరాడు. తద్వారా గ్రూప్-ఏ లో మొదటి స్థానంలో నిలిచాడు.
అయితే భారత దేశానికే చిందిన జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. 74.81 మీటర్లు మాత్రమే విసరడంతో అర్హత సాధించ లేకపోయాడు. గోల్ఫ్ క్రీడాకారులు అదితి అశోక్, దీక్షా దగర్ కూడా తమ టోక్యో ఒలింపిక్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. సెమీఫైనల్స్‌లో మహిళల హాకీ జట్టు అర్జెంటీనాతో తలపడనుంది.

For latest News

Previous articleనెలకు 10 వేల డాలర్లు ఇస్తాం : యూట్యూబ్ ప్రకటన
Next articleబొమ్మాయి మంత్రివర్గంలో 29 మంది