Home క్రీడలు టోక్యో ఒలింపిక్స్ : బాక్సింగ్ లో కాంస్యం సాధించిన లవ్లీనా

టోక్యో ఒలింపిక్స్ : బాక్సింగ్ లో కాంస్యం సాధించిన లవ్లీనా

480
0
Lovlina Borgohain finishes with bronze
Lovlina Borgohain finishes with bronze

టోక్యో ఒలింపిక్స్ : బాక్సింగ్ లో కాంస్యం సాధించిన లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌ మహిళల బాక్సింగ్ లో భారత్ కు చెందిన లవ్లీనా దేశానికి కాంస్య పతకం అందించింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్ బౌట్‌ (64-69 కేజీలు) బాక్సింగ్‌లో టర్కీకి చెందిన ప్రపంచ ఛాంపియన్ బుసేనాజ్ సుర్మెనెలీ చేతిలో 5-0 తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికి సెమి ఫైనల్ చేరడం తో కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఒలింపిక్ క్రీడల్లో విజేందర్ సింగ్, మేరీ కోమ్ తర్వాత పతకం సాధించిన మూడో భారతీయ బాక్సర్‌గా బోర్గోహైన్ నిలిచింది. ఇతర సెమీఫైనల్లో అమెరికాకు చెందిన ఓషే జోన్స్‌ని ఓడించిన తర్వాత ఫైనల్‌లో సుర్మేనెలీ చైనాకు చెందిన గు హాంగ్‌తో తలపడుతుంది.
ఎఐబిఎ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు పతక విజేతగా ఉన్న బోర్గోహైన్, ప్రారంభ రౌండ్‌లో బై అందుకున్న తర్వాత 16 వ రౌండ్‌లో జర్మనీకి చెందిన నాడిన్ అపెట్జ్‌ను స్ప్లిట్ డెసిషన్ (3-2) తో ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో, అస్సాంకు చెందిన ఈ బాక్సర్ చైనీస్ తైపీకి చెందిన చెన్ నిన్-చిన్‌ను 4-1 తేడాతో ఓడించి ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ 2012 లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.
అస్సాంలోని ప్రసిద్ధ కజీరంగా జాతీయ ఉద్యానవనం ఉన్న గోలాఘాట్ జిల్లాలోని బారో ముఖియా గ్రామంలో లవ్లీనా పెరిగింది. ఆమెకు లిమా-లిచా అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారి తల్లిదండ్రులు పేదరికంలో మగ్గినప్పటికీ, తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సహించారు. ఆమె తల్లి మామోని గత ఏడాది కిడ్నీ మార్పిడి చేయించుకుంది. బోర్గోహైన్ ఆ సమయంలో కొన్ని రోజులు ఆమె కోసం హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. ఒలింపిక్ కు అర్హత సాధించిన గ్రూప్‌తో 52 రోజుల యూరోప్ ట్రిప్ కోసం బయలుదేరడానికి ఒక రోజు ముందు లవ్లీనా కోవిడ్ -19 బారిన పడింది. ఎట్టకేలకు కోలుకున్న ఆమె ఒలింపిక్స్ లో పతకం సాధించి, మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.

For latest News

Previous articleగణనీయంగా తగ్గిన కరోనా కేసులు : కేంద్రం
Next articleహత్యాచార బాలిక కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ