Home సినిమాలు టీఎన్నార్ కుటుంబానికి ఐ డ్రీమ్ సంస్థ రూ.10 లక్షల ఆర్థికసాయం

టీఎన్నార్ కుటుంబానికి ఐ డ్రీమ్ సంస్థ రూ.10 లక్షల ఆర్థికసాయం

122
0

కరోనా వైరస్ తో ఇటివల మరణించిన ప్రముఖ సినీ పాత్రికేయుడు, వ్యాఖ్యాత, నటుడు టీఎన్నార్ మృతి పట్లా గతంలో ఆయన పని చేసిన ఐ డ్రీమ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టీఎన్నార్ కుటుంబానికి ఆ సంస్థ రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

ఐ డ్రీమ్ మీడియా సంస్థ చైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి, టీఎన్నార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐ డ్రీమ్ యూట్యూబ్ చానల్ కోసం అనేకమంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసి, ఐ డ్రీమ్ పాప్యులారిటీ పెంచడంలో తన వంతుగా టీఎన్నార్ శ్రమించారు. తమ సంస్థ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన టీఎన్నార్ ఇప్పుడు తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.

మా సంస్థలో టీఎన్నార్ ఉద్యోగి మాత్రమే కాదని, సంస్థ ఎదుగుదలకు విలువైన సూచనలు, సలహాలు అందించాడని, తనకు సన్నిహితుడు అని వాసుదేవరెడ్డి తెలిపారు.   ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా రూ.10 లక్షల చెక్ ను టీఎన్నార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. 

Previous articleClassified listings Ads Products and services Help Lonely people Find Love On The Internet
Next articleకరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజినీకాంత్