Home క్రీడలు టి-20 వరల్డ్ కప్.. ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్

టి-20 వరల్డ్ కప్.. ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్

208
0
India and Pakistan in Same Group in T20 World Cup-2021
India and Pakistan in Same Group in T20 World Cup-2021

రాబోయే ట్వంటీ 20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో తలపడనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గ్రూపు 2 లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ లు ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో పురుషుల టి 20 ప్రపంచ కప్ బిసిసిఐ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ సూపర్ 12లో గ్రూప్ 2 లో నిలిచారు. గ్రూప్ దశలో ఇరు జట్లు పోటీపడతాయి. 2021 మార్చి 20 నాటికి జట్టు ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ గ్రూపులు ఎంపిక చేయబడ్డాయి. 2019 టి 20 వరల్డ్ కప్ ద్వారా ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించాయి.

ఇక సూపర్ 12 లలో గ్రూప్ 1 లో మాజీ ఛాంపియన్స్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. రౌండ్ 1 నుంచి ఇద్దరు క్వాలిఫైయర్లు వారితో చేరారు. గ్రూప్ 2 లో మాజీ ఛాంపియన్స్ ఇండియా మరియు పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు రౌండ్ 1 నుండి ఇతర ఇద్దరు క్వాలిఫైయర్లు ఉంటారు.
కోవిడ్ వల్ల కలిగే అంతరాయం కారణంగా వీలైనంత త్వరగా గ్రూపులను ప్రకటించామని ఐసిసి యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలార్డైస్ అన్నారు. కేవలం మూడు నెలల్లో టి-20 వరల్డ్ కప్ అత్యంత పోటీతత్వ వాతావరణంలో అలరించనుంది అని వెల్లడించారు. బిసిసిఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ టి-20 వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఈ పోటీల్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్ – పాకిస్థాన్ ఆడే మ్యాచ్ లు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తాయన్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఒక ప్రధాన శక్తిగా, సభ్య దేశాలను ప్రోత్సహించడానికి, వారికీ సహాయం చేయడానికి బిసిసిఐ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ ఆతిథ్యంతో ఒమన్‌ను ప్రపంచ క్రికెట్‌లోకి తీసుకురావడం శుభపరిణామన్నారు. ఇది చాలా మంది యువ ఆటగాళ్లకు క్రికెట్ పట్ల ఆసక్తి చూపడానికి సహాయపడుతుందని వ్యాఖ్యానించారు.

Previous articleఅపోహలు వీడండి.. ఇవి తినండి : ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ
Next articleకసరత్తు చేసిన తర్వాతే.. గెజిట్ విడుదల : సంజయ్‌ అవస్థి