Home తెలంగాణ టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్

టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్

474
0
Gellu Srinivas is TRS candidate for Huzurabad by-election
Gellu Srinivas is TRS candidate for Huzurabad by-election

టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్
హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిపై టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టతనిచ్చారు. ఎట్టకేలకు ఇప్పటివరకు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. ఆగస్టు 16న హుజూరాబాద్ లో జరగనున్న టీఆర్ ఎస్ బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ గురించి
1983 ఆగస్టు 21 న కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం హిమ్మత్ నగర్‌లో మల్లయ్య మరియు లక్ష్మి దంపతులకు జన్మించిన శ్రీనివాస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ, ఎల్ఎల్ బి పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్‌లో పిహెచ్ డి కూడా చేశాడు.

అంబర్‌పేటలోని ప్రభుత్వ బిసి హాస్టల్‌లో నివసిస్తున్నప్పుడు శ్రీనివాస్ ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లి, గగన్ మహల్‌లోని ఎవి కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అతను 2003 నుంచి 2006 మధ్య హాస్టల్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ప్రసంగాలతో ప్రభావితమై ఆ పార్టీలో చేరారు.

రసకందాయంగా రాజకీయం
టిఆర్ఎస్ లో విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఇక టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనా, ఆ పార్టీ నాయకులపైనా మాటల తూటాలను ఎక్కు పెడుతున్నారు. తాను దళితుల భూములను ఆక్రమించుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతూ ప్రజల్లో సానుభూతి సంపాదించుకున్నారు.

ప్రజల్లో తిరుగుతూ తన బాణిని వినిపించారు. ఫలితంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. పాదయాత్రలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ స్థానికంగా బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డిని టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో ఉద్యమకారులపై రాళ్ళూ వేయించిన కౌశిక్ రెడ్డిని కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. దీంతో ఉద్యమ నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా నిలబెట్టి తమపై వస్తున్న విమర్శలకు కేసీఆర్ చెక్ పెట్టారు. ఇక కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎంఎల్ సి పదవిని ఇచ్చారు.

ఇప్పటికే కేసీఆర్ హుజురాబాద్ లో ప్రారంభించిన దళిత బంధు పథకంతో దళితులు అధికార పార్టీ వైపు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రజలు తననే గెలిపిస్తారనే ధీమాతో ఈటల రాజేందర్ ఉన్నారు.

For More News

Previous articleవ్యాక్సిన్ల మిక్సింగ్.. మంచిదేనా?
Next articleబ్లాక్‌చెయిన్ ఛేదించి.. 12 వేల కోట్లు దోచిన హ్యాకర్!