Home Covid 19 జికా వైరస్.. మహారాష్ట్రకు కేంద్ర బృందం

  జికా వైరస్.. మహారాష్ట్రకు కేంద్ర బృందం

  320
  0

  జికా వైరస్.. మహారాష్ట్రకు కేంద్ర బృందం జికా వైరస్ కేసుల నిర్వహణ, కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు తరలించింది. భారతదేశంలో కేరళ తర్వాత జికా వైరస్ కేసులు నమోదయిన రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. ఈ కేంద్ర బృందంలో పుణెలోని ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం నుండి ఆరోగ్య నిపుణుడు, న్యూఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీకి చెందిన గైనకాలజిస్ట్, న్యూ ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్కు చెందిన కీటక శాస్త్రవేత్త ఉన్నారు.
  అధికారిక ప్రకటన ప్రకారం, ఉన్నత స్థాయి బృందం మహారాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి పని చేస్తుంది. జికా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పరిస్థితిని అంచనా వేయడం, అవసరమైన ప్రజారోగ్య సలహాలను సిఫార్సు చేయడం వంటివి ఈ బృందం చేయనుంది.
  మహారాష్ట్రలో జికా
  పుణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆదివారం మహారాష్ట్రలో మొదటి జికా వైరస్ కేసును ధృవీకరించింది. బెల్సర్ గ్రామానికి చెందిన రోగి (50 ఏళ్ల మహిళ) జూలైలో జ్వరం వచ్చింది. కానీ తర్వాత కోలుకుంది. ఆమెకు జికా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులెవరూ ఇప్పటివరకు వ్యాధి బారిన పడకపోవడం, లక్షణాలు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ కేసు పరిశీలించిన డాక్టర్లు చికున్‌గున్యా పాజిటివ్‌గా వచ్చినందున ఆ మహిళకు మిశ్రమ ఇన్‌ఫెక్షన్ ఉందని చెప్పారు. మహారాష్ట్రకు ముందు, కేరళలో ఈ సంవత్సరం జూలైలో 63 వరకు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.
  జికా వైరస్ అంటే ఏమిటి?
  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, జికా వైరస్ ఈడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మొదటిసారిగా 1952 లో ఉగాండా, టాంజానియాలోని మానవులలో గుర్తించబడింది. వ్యాధి లక్షణాలు సాధారణంగా తేలికపాటి జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు మరియు కీళ్ల నొప్పి లేదా తలనొప్పి ఇలా చాలా లక్షణాలు రెండు-ఏడు రోజుల వరకు ఉంటాయి. లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ సంక్రమిస్తుంది. నిపుణులు కూడా జికా వైరస్ సంక్రమణ గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. జికాకు వ్యతిరేకంగా రక్షణ చర్యలలో వీలైనంత వరకు శరీరంలోని అన్ని భాగాలను కప్పి ఉంచే లేత రంగు దుస్తులు ధరించడం, కిటికీ తెరలు, తలుపులు మూసి ఉపయోగించడం, దోమలను తరిమికొట్టే ఆల్ ఔట్, గుడ్ నైట్ ప్లస్ వంటివి ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

  For latest News

  Previous articleజొమాటో ప్రో ప్లస్.. అపరిమిత ఫ్రీ డెలివరీ!
  Next articleకాంస్యం తప్పక సాధిస్తాం : భారత హాకీ స్టార్ మన్ దీప్ సింగ్