Home క్రీడలు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం.. తీరిన భారత్ వందేళ్ల కల

జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం.. తీరిన భారత్ వందేళ్ల కల

809
0
In Javelin Throw Indian Athlete Neeraj Chopra won Gold Medal in Tokyo Olympics
In Javelin Throw Indian Athlete Neeraj Chopra won Gold Medal in Tokyo Olympics

జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం.. తీరిన భారత్ వందేళ్ల కల భారత్ కు ఇప్పటి వరకు 7 పతకాలు టోక్యో ఒలింపిక్స్ లో వచ్చినా.. ఒక్క స్వర్ణ పతకం కూడా లేకపోవడం ఒక లోటుగా అనిపించింది. అయితే ఇప్పుడా లోటును జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తీర్చేశాడు.

అథ్లెటిక్స్ లో వ్యక్తిగత స్వర్ణం సాధించి భారత ఒలింపిక్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

క్వాలిఫికేషన్ రౌండ్ లోనే అత్యధిక దూరం విసిరి పతకం పై ఆశలు రేకెత్తించిన నీరజ్ చోప్రా… ఫైనల్ లోనూ అదే ప్రతిభను కనబర్చి స్వర్ణాన్ని ఒడిసిపట్టాడు. 130 కోట్ల భారతీయులను సంబరాల్లో ముంచెత్తాడు.


నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్‌ లో తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు విసిరి తొలి స్థానంలో నిలిచాడు. అనంతరం రెండో ప్రయత్నంలో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. రెండవ ప్రయత్నంలో 87.58 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు.

ఆట ప్రారంభంలోనే తన ప్రత్యర్థులెవరూ సమీపించలేనంత దూరాన్ని మొదట్లోనే నమోదు చేశాడు. ఫలితంగా స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇక మిగిలిన వారి ప్రయత్నాలు రజత, కాంస్య పతకాల కోసమే పోటీ పడ్డారంటే అతిశయోక్తి కాదు.

ఒలింపిక్స్ లో భారత్ కు హాకీ విభాగంలో ఇప్పటి వరకు 8 స్వర్ణాలు వచ్చాయి. అయితే వ్యక్తిగత విభాగంలో 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత ఏ ఒక్కరికీ స్వర్ణ పతకం రాలేదు.

ప్రస్తుతం ఆ కొరత.. జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా తెచ్చిన స్వర్ణంతో తీరింది. ఆయనకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

For Latest News

Previous articleటోక్యో ఒలింపిక్స్ : కాంస్యాన్ని సాధించిన బజరంగ్ పూనియా
Next articleకర్నూల్ లో పాశవికం.. విలేకరిని హత్య చేసిన పోలీసు?