Home జాతీయ వార్తలు జార్కిహోళి రాసలీలల కేసు.. ఆధారాల్లేవన్న సిట్!

జార్కిహోళి రాసలీలల కేసు.. ఆధారాల్లేవన్న సిట్!

385
0
Jarkiholi Sexual Assault Case.. Sit Investigation Complete
Jarkiholi Sexual Assault Case.. Sit Investigation Complete

కర్ణాటకలో సంచలనం రేపిన మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ సిడి కేసులో ఆధారాల్లేవంటూ బెంగళూరు పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటి) పేర్కొంది. సదరు కేసులో జార్కిహోళి పాల్గొన్నట్లు, ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడట్లు ఓ యువతి ఆరోపిస్తూ పొలిసు కేసు పెట్టింది. తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసులో అప్పట్లో బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే ప్రస్తుతం సదరు యువతికి వ్యతిరేకంగా ఆధారాలు లభించినట్లు సిట్ పేర్కొనడం గమనార్హం.
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తులో, మంత్రి తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ లైంగిక దోపిడీకి పాల్పడినట్లు యువతి చేసిన ఆరోపణల్లో ఆధారాలు లభించలేదని సిట్ వివరించింది. ఆమె ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కాదని, కాలేజీలో తన రెండవ సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సును వదిలేసినట్లు సిట్ వెల్లడించింది. ఆరోపణలు చేసిన సదరు యువతి రాష్ట్రంలో ఆనకట్టల వీడియోలను చిత్రీకరించడానికి మంత్రి అనుమతి కోరిందని సిట్ తెలిపింది. విద్యార్థి ముసుగులో అప్పటి నీటి వనరుల మంత్రిగా ఉన్న జార్కిహోలిని సంప్రదించగా ఆయన సమ్మతి తెలిపారని, ఆ తర్వాత మంత్రితో సాన్నిహిత్యం ఏర్పడిందని దర్యాప్తులో తేలినట్లు సిట్ పేర్కొంది. లైంగిక దాడి కేసు దర్యాప్తులో భాగంగా జార్కిహోళి నుంచి డబ్బులు దోచుకోవడానికి, ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేయడానికి సదరు యువతి యత్నించిందని సిట్ అధికారులు తెలిపారు. జార్కిహోళితో తాను సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను తీసి, యువతి బెదిరింపులకు పాల్పడిందని సిట్ వివరించింది. ఈ కుట్రను బలపర్చేలా “చాలా సాక్ష్యాలు” వెలికి తీసినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తులో మినీ కెమెరా కోసం ఒక పెట్టెను ఏర్పాటు చేయగా దానిని స్వాధీనం చేసుకున్నామని సిట్ వివరించింది. జార్కిహోళితో తన సమావేశాలకు యువతి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులు నరేష్ గౌడ, శ్రావణ కుమార్ ఈ కేసులో కీలక నిందితులుగా సిట్ అభివర్ణించింది. జార్కిహోలిని యువతి కలిసిన ప్రతిసారీ వీరిద్దరూ ఆ పరిసరాల్లో ఉన్నట్లు సూచించడానికి సాంకేతిక ఆధారాలు లభించాయని సిట్ తెలిపింది.

Previous articleపరిస్థితి అదుపులోనే.. అస్సాం-మిజోరం ఘర్షణలపై కేంద్రం స్పందన
Next articleతెలంగాణాలో సినిమా థియేటర్లు కళకళ