Home Covid 19 జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి

    జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి

    409
    0
    Johnson and Johnson’s single-dose Covid-19 vaccine gets approval in India
    Johnson and Johnson’s single-dose Covid-19 vaccine gets approval in India

    జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి జాన్సన్ మరియు జాన్సన్ యొక్క సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ వాడకాన్ని భారతదేశం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం ట్విట్టర్ లో తెలిపారు. తాము భారత్ లోని బయోలాజికల్ – ఇ సంస్థతో భాగస్వామ్యం చేసుకున్నామని ఆ సంస్థ శుక్రవారం తెలిపింది.

    గతంలో తమ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుని, అనంతరం ఉపసంహరించుకుంది. మరలా శుక్రవారం మరోసారి అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలో బయోలాజికల్ – ఇ సంస్థ ఎండీ మహిమ దాట్ల శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మనసుఖ్ మాండవీయను కలుసుకున్నారు.

    ఆ తరువాత రోజే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.

    ఇదిలా ఉండగా గత 24 గంటల్లో భారతదేశంలో 38,628 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 3.19 కోట్ల మంది ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడ్డారు. 617 మంది ఈ వ్యాధి బారిన పడి తుదిశ్వాస విడిచారు.

    దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,27,371 కి పెరిగింది. 19,948 కేసులను నమోదు చేసిన కేరళ దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది. మహారాష్ట్ర 5,539 కేసులతో ఆ తర్వాత స్థానంలో ఉంది.

    భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,12,153గా ఉంది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 1.30 శాతం మెరుగుపడిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.

    దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం టీకా మోతాదుల సంఖ్య 495.3 మిలియన్లకు చేరుకుంది. భారతదేశంలో 50 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు అందించారు.

    దేశంలో ఇప్పటి వరకు 50 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను ఇచ్చామని, 43.29 లక్షలకు పైగా డోస్‌లు శుక్రవారం వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    టీకాల వేగం పెరుగుతున్న తీరును వివరిస్తూ, దేశం 10 కోట్ల సంఖ్యను తాకడానికి 85 రోజులు పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ అన్నారు. 20 కోట్ల మార్కును దాటడానికి 45 రోజులు, 30 కోట్లకు చేరుకోవడానికి మరో 29 రోజులు పట్టిందని వివరించారు. 40 కోట్లకు చేరుకోవడానికి మరో 24 రోజులు, 50 కోట్ల టీకాలు దాటడానికి మరో 20 రోజులు పట్టిందని చెప్పారు.

    మహమ్మారి వేళ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ : ప్రధాని మోదీ
    కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి సమయంలో 80 కోట్ల మంది భారతీయులు ఉచిత రేషన్ పొందారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం చెప్పారు. వీరిలో మధ్యప్రదేశ్ నుండి ఐదు కోట్ల మంది ఉన్నారు, రాష్ట్రంలోని ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన లబ్ధిదారులతో వీడియో

    ఇంటరాక్షన్ సందర్భంగా మోడీ చెప్పారు. గత 100 సంవత్సరాలలో మానవాళి ఎదుర్కొన్న అతి పెద్ద విపత్తుగా కరోనావైరస్ మహమ్మారిని అభివర్ణించిన మోదీ, వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచడం, సామాజిక దూరం పాటించడం కొనసాగించాలని అన్నారు.

    కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలనే వ్యూహంలో భారతదేశం పేదలకు మొదటి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. కరోనా ప్రారంభమైన మొదటి రోజు నుండే పేదలకు ఆహారం, ఉపాధి గురించి ఆలోచించాము అని మోడీ అన్నారు.

    For More News

    Previous articleరాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ
    Next articleపాక్‌లొని హిందూ దేవాలయంపై దాడి.. 20 మంది అరెస్టు