Home Covid 19 చికెన్ పాక్స్ లా వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియెంట్ : అమెరికా అధ్యయనంలో వెల్లడి

    చికెన్ పాక్స్ లా వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియెంట్ : అమెరికా అధ్యయనంలో వెల్లడి

    309
    0
    Delta variant may spread like chickenpox
    Delta variant may spread like chickenpox

    కరోనా వైరస్ యొక్క డెల్టా వేరియంట్ మిగిలిన అన్ని రకాల వైరస్ ల కంటే తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని తేలింది. అంతేకాకుండా ఇది చికెన్‌పాక్స్ మాదిరి సులభంగా వ్యాప్తి చెందుతుందని యుఎస్ హెల్త్ అథారిటీ అధ్యయనంలో అంతర్గత పత్రాన్ని ఉటంకిస్తూ మీడియా నివేదికలు తెలిపాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నుండి వచ్చిన డాక్యుమెంట్ ఈ వివరాలను అధ్యయనం చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా వ్యాక్సిన్ పొందిన వ్యక్తులు డెల్టా వేరియంట్ ను వేగంగా వ్యాప్తి చేసే అవకాశం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.
    అమెరికా లోని వాషింగ్టన్ పోస్ట్ సంబంధిత వివరాలను ప్రచురించింది. సిడిసి డైరెక్టర్ డాక్టర్ రోచెల్ పి వాలెన్స్కీ మాట్లాడుతూ వ్యాక్సిన్ పొందిన వ్యక్తులు డెల్టా వేరియంట్ ను వ్యాప్తి చేసే వాహకాలుగా ఉంటున్నారని పేర్కొన్నారు. వారి గొంతు, ముక్కులో రోగుల మాదిరిగానే వైరస్ ను కలిగి ఉంటారని చెప్పారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న కారణంగా వారిలో వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం లేదని, లేదా తక్కువ స్థాయిలో కనిపించే అవకాశము ఉందని తెలిపారు. దీంతో ఈ అధ్యయనం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. మెర్స్, సార్స్, ఎబోలా, సాధారణ జలుబు, సీజనల్ ఫ్లూ, మశూచికి కారణమయ్యే వైరస్‌ల కంటే డెల్టా వేరియంట్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తేలింది.
    ఈ సంచలన అధ్యయనంపై అమెరికా వ్యాప్తంగా శాస్త్రవేత్తలలో డేంజర్ బెల్ మోగిందనే చెప్పొచ్చు.

    అమెరికా సిడిసి మాత్రం కరోనా డెల్టా వేరియంట్ తీవ్ర ముప్పుగా వస్తున్న గణాంకాలపై ఆందోళన చెందుతోంది. ఈ నివేదికలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తాయని భావిస్తోంది. ఇంటర్నేషనల్ ప్రెజెంటేషన్‌లో జూలై 24 నాటికి CDC సేకరించిన డేటా ప్రకారం, 162 మిలియన్ల టీకాలు ప్రజలకు వేసినట్లు తెలుస్తోంది. అయితే వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కూడా కేసుల నమోదు అక్కడి ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేసిన తర్వాత అక్కడ ప్రజలు బహిరంగంగా తిరగడం, వివిధ ఉత్సవాలు, విందులు వినోదాల్లో మునిగితేలడం వంటి కారణాల వల్లే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలుస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకున్న సరే ఇంట్లో కూడా మాస్కుల వాడకాన్ని సూచించాలనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

    Previous articleసంక్రాంతికి రాధేశ్యామ్.. జనవరి 14న విడుదల
    Next articleసరిహద్దులో ఇద్దరు పాక్ చొరబాటుదారులు కాల్చివేత