Home జాతీయ వార్తలు గోవా ద్వీప వాసుల నిరసన.. త్రివర్ణ పతాకావిష్కరణ రద్దు చేసిన నేవీ

గోవా ద్వీప వాసుల నిరసన.. త్రివర్ణ పతాకావిష్కరణ రద్దు చేసిన నేవీ

300
0
Navy cancels unfurling of Tricolour on Goa island after locals oppose
Navy cancels unfurling of Tricolour on Goa island after locals oppose

గోవా ద్వీప వాసుల నిరసన.. త్రివర్ణ పతాకావిష్కరణ రద్దు చేసిన నేవీ అధికారులపై తీరుపై తమకు నమ్మకం లేదని వారు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వారెవరైనా తమ ద్వీపంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక భారత నావికా దళ అధికారులు కూడా జాతీయ జెండా ఆవిష్కరణను రద్దు చేశారు. దీనిపై గోవా ముఖ్యమంత్రి మండిపడ్డారు. ద్వేప వాసులను దేశ వ్యతిరేకులుగా అభివర్ణించారు. ఇదంతా దక్షిణ గోవాలోని సావో జసింటో ద్వీపంలో జరుగుతున్న వివాదమిదీ..

జాతీయ జెండాను ఆవిష్కరించడాన్ని నేవీ శుక్రవారం రద్దు చేసింది. దక్షిణ గోవాలోని సావో జసింటో ద్వీపంలో స్థానికులు వ్యతిరేకించడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దీనిని భారత వ్యతిరేక చర్య అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కు పిడికిలితో అణచి వేస్తామని చెప్పారు. భారత నావికాదళం వారి ప్రణాళికతో ముందుకు సాగాలని, గోవా పోలీసుల నుండి పూర్తి సహకారం అందిస్తామని ఆయన ప్రకటించారు.

“భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెయింట్ జసింటో ద్వీపంలోని కొంతమంది వ్యక్తులు భారత నావికాదళం జాతీయ జెండాను ఎగురవేయడాన్ని వ్యతిరేకించడం దురదృష్టకరం మరియు సిగ్గుచేటు. నేను దీనిని ఖండిస్తున్నాను. గోవా ప్రభుత్వం అటువంటి చర్యలను సహించదని చెప్పాలనుకుంటున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.

అయితే, జెండా ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదని ద్వీపవాసులు స్పష్టం చేశారు. గ్రామ వాసులు తాము జెండాను ఎగురవేస్తామని వారు చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాది కా అమృత్ మహోత్సవానికి రక్షణ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. 2021 ఆగస్టు 13 మరియు 15 మధ్య దేశవ్యాప్తంగా ద్వీపాలలో జాతీయ జెండా ఆవిష్కరణకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. గోవా నావల్ అధికారులు సావో జసింటో ద్వీపంతో సహా గోవా ద్వీపాలను సందర్శించింది. అయితే స్థానిక నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జసింటో ద్వీపంలోని జెండా ఆవిష్కరణ రద్దు చేయాల్సి వచ్చింది.

సావో జాసింటోలో పెరిగిన డారెల్ డిసౌజా దీనిపై స్పందించారు. సాంప్రదాయకంగా, ద్వీపవాసులు ప్రతి సంవత్సరం జాతీయ జెండాను ఎగురవేస్తున్నారని చెప్పారు. కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్లాన్ కు తమ వ్యతిరేకత నేపథ్యంలో ద్వీపంలో నేవీ ఉనికి గురించి ఆందోళన చెందుతున్నామని చెప్పారు. జెండా ఎగురవేయడానికి మేం ఏమాత్రం వ్యతిరేకం కాదు. వాస్తవానికి, ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ కోసం మాతో చేరాలని ద్వీపానికి వచ్చిన నౌకాదళ అధికారులకు చెప్పామని డిసౌజా అన్నారు.

ద్వీపవాసులు, సాంప్రదాయ మత్స్యకారులు, రాజకీయ కార్యకలాపాలకు భయపడటం వల్ల ఈ ద్వీపం యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకం అని వారు నమ్ముతున్నారని ఆయన వివరించారు. పోర్టు పరిమితుల్లోకి తీసుకువచ్చిన ఈ ద్వీపాన్ని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటారని మరియు అభివృద్ధి కోసం ప్రైవేట్ పార్టీలకు అప్పగిస్తారని ప్రజలు భయపడుతున్నారని ఆయన అన్నారు. గోవా ద్వీపాలలో ఆందోళన కలిగించే మేజర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్లు – 2020 పార్లమెంట్ ఆమోదం పొందింది.

Previous articleబలప్రయోగంతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించం : తాలిబాన్లకు పలు దేశాల సూచన
Next articleకాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్