Home జాతీయ వార్తలు గోవా గ్యాంగ్ రేప్.. సిఎం వ్యాఖ్యలపై దుమారం

గోవా గ్యాంగ్ రేప్.. సిఎం వ్యాఖ్యలపై దుమారం

412
0
Goa CM Comments Viral on Girls Gang Rape
Goa CM Comments Viral on Girls Gang Rape

తమ ఆడపిల్లలను అర్ధరాత్రి ఎందుకు బయటకు పంపుతున్నారో తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలోని బెనౌలిమ్ బీచ్‌లో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగిన కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. బుధవారం గోవా అసెంబ్లీలో కాలింగ్ అటెన్షన్ నోటీసుపై చర్చ సందర్భంగా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడారు. 14 ఏళ్ల పిల్లలు రాత్రంతా బీచ్‌లో ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని, పిల్లలు వారి మాట వినకపోతే పోలీసులు, ప్రభుత్వం బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పిల్లల భద్రత, వారికి మంచి చెడు చెప్పే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, తమ పిల్లలను ముఖ్యంగా మైనర్లను రాత్రి సమయంలో బయటికి వెళ్లడానికి అనుమతించవద్దని సూచించారు.
ప్రతిపక్ష నాయకుల విమర్శలివీ..
తీరప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని పేర్కొన్న గోవా కాంగ్రెస్ ప్రతినిధి ఆల్టోన్ డి కోస్టా గురువారం మాట్లాడుతూ, రాత్రిపూట తిరిగేటప్పుడు సామాన్యులు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. నేరస్థులు జైలులో ఉండాలని, చట్టాన్ని గౌరవించే పౌరులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండాలని అన్నారు. అత్యాచార ఘటనపై గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్ స్పందిస్తూ పౌరుల భద్రతను చూసే బాధ్యత పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. పౌరులకు భద్రత అందించలేకపోతే సిఎంగా కొనసాగే నైతిక హక్కు ప్రమోద్ సావంత్ కు లేదని పేర్కొన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటే ట్విట్టర్లో దీనిపై స్పందిస్తూ తమ పిల్లలను రాత్రిపూట బయటకు వెళ్ళడానికి అనుమతించినందుకు తల్లిదండ్రులను గోవా సీఎం నిందించడం ఆశ్చర్యకరమన్నారు. పౌరుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతే, ఇంకెవరిస్తారని ప్రశ్నించారు. మహిళలకు సురక్షితమైన రాష్ట్రంగా గోవాకు చరిత్ర ఉందని, అయితే అది బిజెపి పాలనలో కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

ప్రమోద్ సావంత్ వ్యాఖ్యలివి..
ఆదివారం జరిగిన సంఘటనను వివరిస్తూ, టీనేజ్ యువకులు, ముఖ్యంగా మైనర్లకు బీచ్ లలో రాత్రులు గడపకూడదని ప్రమోద్ సావంత్ నొక్కిచెప్పారు. తాము పోలీసులను నేరుగా నిందించామని, కాని పార్టీ కోసం బీచ్ కి వెళ్ళిన 10 మంది యువకులలో, నలుగురు రాత్రంతా బీచ్ లోనే ఉండగా, మిగిలిన ఆరుగురు ఇంటికి వెళ్ళారన్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు మాత్రం రాత్రంతా బీచ్‌లో ఉన్నారని ప్రమోద్ సావంత్ సభలో అన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన అసెంబ్లీకి తెలిపారు. బుధవారం సభలో జరిగిన చర్చ సందర్భంగా ఒక ఎమ్మెల్యే ఒక ‘ప్రభావవంతమైన వ్యక్తి’ నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని, మరో ప్రతిపక్ష సభ్యుడు ఒక మంత్రి పోలీసులను పిలిచి దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను స్పీకర్ రాజేష్ పట్నేకర్ రికార్డుల నుండి తొలగించారు.
జూలైలో గోవా రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెనౌలిమ్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. బాలికలతో కలిసి ఉన్న అబ్బాయిలను కొట్టిన తరువాత నలుగురు పురుషులు ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. రిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి (వ్యవసాయ శాఖ డ్రైవర్) కావడం గమనార్హం. నిందితులు పోలీసులుగా నటించి ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు.

Previous articleబ్యాంకింగ్ నూతన పాలసీలు గురించి తెలుసా?
Next articleరాకేష్ ఆస్థానా మాకొద్దు.. ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం