Home సినిమాలు గోవాలో వర్షంతో ఎంఎస్ రాజు చిత్రం షెడ్యూల్ ముగింపు

గోవాలో వర్షంతో ఎంఎస్ రాజు చిత్రం షెడ్యూల్ ముగింపు

295
0
7 Days and 6 Nights Telugu Movie
7 Days and 6 Nights Telugu Movie

గోవాలో వర్షంతో ఎంఎస్ రాజు చిత్రం షెడ్యూల్ ముగింపు గోవాలో కుండపోత వర్షాలు, కోవిడ్ మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్ చిత్రం షెడ్యూల్ ను మార్చారు. అక్కడితో షెడ్యూల్ ముగించి మంగళూరు – ఉడిపికి తర్వాత షెడ్యూల్ కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ తన కెరీర్‌లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన తర్వాత, ‘డర్టీ హరి’ వంటి అద్భుతమైన చిత్రం దర్శకుడిగా తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు.

తన తదుపరి దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ ను మరింత అద్భుతంగా తీయనున్నట్లు పేర్కొన్నారు. కథనం ప్రభావం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. హీరో సుమంత్ అశ్విన్ తన కెరీర్‌లో అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూపించినట్లు చెప్పారు. ఇది ఆయన కెరీర్‌లో అత్యుత్తమ సినిమాగా నిలిచిపోతుందని తనకు బలమైన నమ్మకం ఉందని చెప్పారు. మెహర్ చాహల్ ప్రధాన పాత్రలో మంచి నటన కనబర్చిందన్నారు. తాను ఇప్పటికే చాలా మంది అర్హత కలిగిన, యువ సిబ్బందిని, నటీనటులను పరిచయం చేసినట్లు వివరించారు.

రోహన్, కృతికా శెట్టి ఇలా కొంత మంది పేర్లను ఆయన ఉదహరించారు. సమర్థ్ గొల్లపూడి వంటి 16 మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను సంగీత దర్శకుడిగా పరిచయం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ ఎడిటర్ జునైద్ సిద్దిక్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, ఏబీజీ క్రియేషన్స్ సహకారంతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. వింటేజ్ పిక్చర్స్ & ఏబీజీ క్రియేషన్స్ సహకారంతో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ దీనిని నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఏకకాలంలో ప్రారంభం కాగా, తాజాగా రెండో పోస్టర్ త్వరలో ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర సహ నిర్మాత జె. శ్రీనివాసరాజు చెప్పారు.

Previous articleరక్తపాతాన్ని నివారించడానికి దేశాన్ని వదిలేశా : ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు
Next articleపెగాసస్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం : సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం