Home Technology గోప్యతా విధానంపై.. వెనక్కి తగ్గుతున్నాం : వాట్సాప్

గోప్యతా విధానంపై.. వెనక్కి తగ్గుతున్నాం : వాట్సాప్

126
0
New Feature in WhatsApp Web
New Feature in WhatsApp Web

వినియోగదారుల భద్రత కోసమే అంటూ తీసుకొచ్చిన గోప్యత విధానం(ప్రైవసీ పాలసీ)పై ఎట్టకేలకు వాట్సాప్ వెనక్కు తగ్గింది. ఢిల్లీ హై కోర్టులో వాదోపవాదాల అనంతరం తన నిర్ణయాన్ని న్యాయస్థానానికి శుక్రవారం తెలియజేసింది. ప్రైవసీ పాలసీని అనుమతించాలంటూ వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడీ తమ నుంచి ఉండదని సంస్థ తెలిపింది. భారత రాజ్యాంగ నియమాలను అనుసరించి, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుందనే అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే సమాచార పరిరక్షణ (డేటా ప్రొటెక్షన్) బిల్లు వచ్చేంత వరకు ప్రైవసీ పాలసీని అమలు చేయబోమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులో ప్రైవసీ పాలసీకి అనుమతి ఉంటే.. దానిని అనుసరించి వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ తరపున వాదించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సంస్థ నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచారు.

నూతన పాలసీని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమలు చేయడానికి వాట్సాప్ యత్నించింది. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కొంత వెనక్కి తగ్గినట్లే కనిపించిన వాట్సాప్ మే 15 నుంచి నూతన పాలసీని అమలు చేసింది. దీనిపై వెనక్కి తగ్గాలంటూ కేంద్రం నుంచి లేఖ రావడంతో, ప్రభుత్వంతో రాజీకి వచ్చినట్లే కనిపించింది. ఫేస్ బుక్ తో డేటా షేరింగ్ పై వాట్సాప్ కొంత వెనక్కి తగ్గింది. అసలు దీనికి కేంద్రం ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ఐటి నిబంధనలే కారణంగా పేర్కొనవచ్చు. తొలుత కేంద్రంతో కయ్యానికి కాలు దువ్విన వాట్సాప్.. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన ఐటి నిబంధనలను పూర్తిగా అమలు చేయలేమని చెప్తూ కోర్టును ఆశ్రయించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి మూలకారణమైంది.

Previous articleజైడస్ టీకా.. చిన్నారులకు సంజీవనిలా మారనుందా?
Next articleజికా వైరస్.. కేరళలో కొత్త టెన్షన్