Home అంతర్జాతీయ వార్తలు గోగ్రా స్థావరం నుంచి వైదొలగనున్న భారత్-చైనా దళాలు

గోగ్రా స్థావరం నుంచి వైదొలగనున్న భారత్-చైనా దళాలు

424
0
India, China disengage from Gogra Post in eastern Ladakh
India, China disengage from Gogra Post in eastern Ladakh

గోగ్రా స్థావరం నుంచి వైదొలగనున్న భారత్-చైనా దళాలు తూర్పు లడఖ్‌లోని గోగ్రా హైట్స్ ప్రాంతం నుంచి భారత్-చైనా దళాలు వైదొలగనున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా వైపున మోల్డోలో 12వ కమాండర్-స్థాయి చర్చల అనంతరం ఇరు దేశాల దళాలు వెనక్కి మరలాలని తీర్మానించాయి.

తూర్పు లడఖ్‌లోని పెట్రోల్ పాయింట్ 17ఏ చుట్టూ ఈ తొలగింపు జరగనుంది. సంవత్సరానికి పైగా కొనసాగుతున్న సైనిక పోరులో ఇది ​​రెండు దేశాల మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటి. ఈ ప్రాంతంలో రెండు వైపులా అన్ని తాత్కాలిక నిర్మాణాలు, ఇతర అనుబంధ మౌలిక సదుపాయాలు తొలగించదానికి నిర్ణయించారు.

ఈ ప్రాంతంలో గతంలో ఉండే యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించినట్లు భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.


ఒప్పందం ప్రకారం రెండు వైపులా దశలవారీగా, సమన్వయంతో ఇరు దళాలు వెనక్కి మరలుతాయి. రెండు వైపుల దళాలు ఇప్పుడు వారి శాశ్వత స్థావరాలలో ఉన్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో భారత్ – చైనా సైనికులు ఘర్షణ నెలకొంది. ఉద్రిక్తతలకు తుది పరిష్కారం వచ్చే వరకు ఇరువైపులా పెట్రోలింగ్ నిలిపి వేసినట్లు సైన్యం పేర్కొంది.

గల్వాన్, గోగ్రా, ప్యాంగాంగ్ ప్రాంతాల్లో ఇరు సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. పిపి 15 చుట్టూ ఉన్న హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది.


భారతదేశం – చైనా కార్ప్స్ కమాండర్ల మధ్య పన్నెండవ రౌండ్ చర్చలు జూలై 31న తూర్పు లడఖ్‌లోని చుషుల్ మోల్డో మీటింగ్ పాయింట్‌లో జరిగాయి. భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాల పశ్చిమ ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నిర్మూలనకు సంబంధించిన మిగిలిన ప్రాంతాల పరిష్కారంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను తెలిపాయి.

సమావేశం ఫలితంగా, గోగ్రా ప్రాంతంలో వెనక్కి తగ్గడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గత ఏడాది మే నుండి ఈ ప్రాంతంలో దళాలు ముఖాముఖి పరిస్థితి తలపడేలా వాతావరం ఇక్కడ నెలకొంది. ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలోని నియంత్రణ రేఖను రెండు వైపులా కచ్చితంగా గమనించి, గౌరవిస్తుందని సైన్యం పేర్కొంది.

యథాతథ స్థితిలో ఏకపక్ష మార్పుకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. దీంతో మరొక సున్నితమైన ప్రాంతం పరిష్కరించబడింది. చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు పశ్చిమ సెక్టార్‌లోని LAC లో మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి ఇరుపక్షాలు నిబద్ధతను వ్యక్తం చేశాయి.

For latest News

Previous articleరాజీవ్ ఖేల్ రత్న.. ఇక నుంచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న : ప్రధాని మోడీ
Next articleనరాల వీక్ నెస్ కు అద్భుతమైన హోం రెమెడీస్ ఇక్కడ ఉన్నాయి..