Home ఉద్యోగం తాజా వార్తలు గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు

గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు

267
0
SC ST Job Notification in Residential School
SC ST Job Notification in Residential School

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ బుధవారం విడుదల అయింది. ఇవన్నీ SC, ST సామజిక తరగతులకు చెందిన అభ్యర్థులకు చెందిన బ్యాక్ లాగ్ పోస్టులు. వీటికి ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివి ఉండవు. నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వీటిని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రత్యక్ష నియామకం(బ్యాక్ లాగ్) ద్వారా ప్రిన్సిపాల్ (గ్రేడ్-2), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టిజిటి), కేర్ టేకర్ (వార్డెన్స్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులంతా 16.08.2021 లోగా దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.500/- (ఒక్కో పోస్టుకు) గా నిర్ణయించారు.

ఖాళీల వివరాలివే..

స్కేల్ ఆఫ్ పే ఇలా..

  1. ప్రిన్సిపాల్ గ్రేడ్-2 (రూ. 40270 – 93780)
  2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (రూ. 28940 – 78910)
  3. కేర్ టేకర్ (వార్డెన్) (రూ. 21230 – 63010)

మరిన్ని వివరాలకు https://www.jnanabhumi.ap.gov.in ను సందర్శించవచ్చు.

Previous articleఅంతరిక్షాన్ని చుట్టొచ్చిన ప్రపంచ కుబేరుడు
Next articleహై అలెర్ట్.. భారత్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం