Home అంతర్జాతీయ వార్తలు గాల్వాన్ ఘర్షణ వీడియో విడుదల చేసిన చైనా

గాల్వాన్ ఘర్షణ వీడియో విడుదల చేసిన చైనా

354
0
Galwan Clashes Video released by China
Galwan Clashes Video released by China

గాల్వాన్ ఘర్షణ వీడియో విడుదల చేసిన చైనా గత ఏడాది జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల ఫుటేజీలను చైనా ఆన్‌లైన్ సంస్థల్లో విడుదల అయ్యాయి. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించడానికి కమాండర్ స్థాయి సైనిక చర్చలు కొనసాగిస్తామని నిన్న భారత్-చైనా సంయుక్త ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 1962 యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణలు గత ఏడాది జూన్ 15 న జరిగాయి. ఫుటేజీలో గల్వాన్ నది వంపుపై నుంచి చైనా సైనికులు భారతీయ సైనికులపై రాళ్లు రువ్వడం కనిపిస్తుంది. వేగంగా ప్రవహించే నదిలో కొంతమంది చైనా సైనికులు ఇబ్బందులు పడటం, నదికి ఇరు వైపులా సైనికులు కూడుకుని ఉండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. 1962 యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన ఘర్షణల్లో 20 మంది సైనికులు మరణించారని భారతదేశం అధికారికంగా ప్రకటించింది. చైనా మాత్రం తాము నలుగురు సైనికులను కోల్పోయినట్లు చూచాయగా చెప్పినా, అధికారికంగా ప్రకటించడానికి ఇష్టపడలేదు.
లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్-చైనాలు శనివారం 12వ రౌండ్ సైనిక చర్చలు చేపట్టాయి. పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి అంగీకరించాయి. ఏదేమైనా, తొమ్మిది గంటల సమావేశం తర్వాత హాట్ స్ప్రింగ్స్, గోగ్రా వంటి సరిహద్దు వెంబడి మిగిలిన ఘర్షణ ప్రదేశాల వద్ద ఇరు పక్షాలు వెనక్కి తగ్గేలా చర్చలు సాగాయి. రెండు దేశాల మధ్య సంబంధాలకు డెప్‌సాంగ్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రాతో సహా కీలక ప్రదేశాలలో సమస్యల పరిష్కారం అవసరమని భారతదేశం నొక్కి చెప్పింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) సమావేశం సందర్భంగా జూలై 14 న దుషన్‌బేలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా ప్రతినిధి వాంగ్ యి మధ్య చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖ (LAC)లో ఏవైనా ఏకపక్ష మార్పులు భారతదేశానికి “ఆమోదయోగ్యం కాదని” జై శంకర్ చెప్పారు. తూర్పు లడఖ్‌లో శాంతి, ప్రశాంతతను పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత మాత్రమే మొత్తం సంబంధాలు అభివృద్ధి చెందుతాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌కి జై శంకర్ స్పష్టం చేశారు.

ఈ క్రింది లింక్ లో సంబంధిత వీడియోను చూడొచ్చు.

https://www.ndtv.com/video/news/news/galwan-clashes-china-releases-video-of-june-2020-galwan-clashes-on-day-of-joint-statement-596411

For latest News

Previous articleఆగస్టు 15న మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
Next articleఐఎస్ఎస్ లో ప్రమాదం.. తప్పిన ముప్పు