Home రాజకీయం గాలి జనార్దన్ రెడ్డికి ఊరట.. బళ్లారికి వెళ్లేందుకు సుప్రీం అనుమతి

గాలి జనార్దన్ రెడ్డికి ఊరట.. బళ్లారికి వెళ్లేందుకు సుప్రీం అనుమతి

117
0
Karnataka Ex-Minister G Janardhan Reddy's Bail Norms Relaxed
Karnataka Ex-Minister G Janardhan Reddy's Bail Norms Relaxed

గాలి జనార్దన్ రెడ్డికి ఊరట.. బళ్లారికి వెళ్లేందుకు సుప్రీం అనుమతి అత్యంత అపఖ్యాతి పాలైన మైనింగ్ స్కామ్ లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ వల్ల అరెస్టయిన గాలి జనార్దన్ రెడ్డికి కొంత ఉపశమనం లభించింది. 2015 జనవరి నుండి బెయిల్‌పై ఉన్న ఈ కర్ణాటక మాజీ మంత్రికి సుప్రీం కోర్టు తీర్పుతో ఊరట కలిగింది. ఆయన బెయిల్ షరతులను సడలించి, రాష్ట్ర రాజధాని బెంగళూరుకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామమైన బళ్లారిలో ఉండడానికి కోర్టు అనుమతించింది.

మైనింగ్ కింగ్ గా పేరొందిన ఈ రాజకీయ నాయకుడు.. బళ్ళారి పట్టణాన్ని సందర్శించి వెళ్లిపోయేటప్పుడు పోలీసు సూపరింటెండెంట్‌కి తెలియజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో విచారణ కూడా ప్రారంభం కాలేదని, పిటిషనర్ ఇప్పటివరకు బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని అందువల్ల నిందితుడు తన స్వస్థలం బళ్లారికి వెళ్ళడానికి అనుమతిస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. ఇంతలో ట్రయల్ కోర్టు ఈ కేసులో విచారణను వేగవంతం చేయవచ్చని న్యాయమూర్తులు వినీత్ శరణ్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

2011 సెప్టెంబర్‌లో అక్రమ మైనింగ్ చేశారన్న ఆరోపణలతో గాలి ని అరెస్టు చేశారు. 2015లో మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. అయితే రాష్ట్రంలోని తూర్పు-మధ్య భాగంలో ఉన్న బళ్లారిని సందర్శించవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2018లో కర్ణాటకలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన అతడిని ఎన్నికల కోసం పట్టణంలో ప్రచారం చేయడానికి కూడా అనుమతించలేదు. ఏదేమైనా, ఆయన జిల్లా వెలుపల తన స్నేహితుడు, బిజెపికి చెందిన శ్రీరాములు కోసం ప్రచారం చేయగలిగాడు.

ఈ కేసులో 47 మంది సాక్షులు బళ్లారి నివాసితులేనని సిబిఐ తెలిపింది. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని, వారిని నిందితుడు తీవ్రంగా ప్రభావితం చేస్తారని సిబిఐ ఆరోపించింది. బళ్ళారి పట్టణాన్ని సందర్శించడానికి అనుమతి కోరుతూ చేసిన గాలి అభ్యర్ధనను వ్యతిరేకించింది. ఇది దర్యాప్తును ప్రభావితం చేస్తుందని పేర్కొంది. సిబిఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ మాధ్వీ దివాన్ బెయిల్ కోసం న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి, లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో రెడ్డిపై అభియోగాలు మోపబడ్డాయని న్యాయస్థానానికి తెలిపారు.

2019 ఆగష్టులో సిబిఐ మాజీ ప్రత్యేక న్యాయమూర్తి.. “క్యాష్-ఫర్-బెయిల్” కేసుకు సంబంధించి సాక్షిగా హాజరయ్యారు. రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి 2012లో న్యాయమూర్తికి 40 కోట్ల లంచం ఆఫర్ చేసినట్లు సిబిఐ పేర్కొంది. దీనిపై సిబిఐ తరుపు న్యాయవాది పలు వాదనలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి శాశ్వతంగా బళ్లారిలో ఉండబోతున్నాడనే వాస్తవం తప్పు సందేశాన్ని పంపుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది అత్యంత అపఖ్యాతి పాలైన మైనింగ్ స్కామ్‌లలో ఒకటి అని న్యాయవాది దివాన్ అన్నారు.

అయితే, ఈ కేసులో విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని, ఆరోపణలు ఇంకా నమోదు కావాల్సి ఉందని, అయితే అతను దాదాపు నాలుగు సంవత్సరాల పాటు జైలులో ఉన్నాడని రెడ్డి తరుపు న్యాయవాదులు వాదించారు. సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ మరియు రంజిత్ కుమార్ లు గాలి జనార్దన్ రెడ్డి తరుపున కోర్టు ముందు హాజరయ్యారు.

Previous articleగంగుబాయి కథివాడి రియల్ స్టోరీ..
Next articleవిపక్ష నేతలతో రేపు సోనియా వర్చువల్ సమావేశం